Skip to main content

India-Russia Defense Partnership: భారత్, రష్యా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు

మూడు రోజుల రష్యా పర్యటనకు వెళ్లిన భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో డిసెంబ‌ర్ 10వ తేదీ భేటీ అయ్యారు.
Indian Defense Minister Rajnath Singh meets Russian President Vladimir Putin in Russia  India May Ink Defence Deal Worth Billions With Russia To Counter China

ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, రక్షణ సహకారం, తదితర అంశాలపై చర్చించారు. రష్యా స్నేహితులకు భారత్‌ అన్నివేళలా అండగా నిలుస్తుందని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. అలాగే.. రష్యాతో భారత ప్ర‌భుత్వం భారీ రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. 
 
ఈ ఒప్పందంలో.. భారత్ రష్యా నుంచి వోరోనెజ్ రాడార్ వ్యవస్థను కొనుగోలు చేయనుంది. ఈ రాడార్ వ్యవస్థ, సుమారు 4 బిలియన్ డాలర్ల విలువ ఉన్న భారీ ఒప్పందం ద్వారా భారత్‌కు అందుబాటులోకి రానుంది. వోరోనెజ్ రాడార్, లాంగ్ రేంజ్ వార్నింగ్ రాడార్ వ్యవస్థగా, దాదాపు 8,000 కిలోమీటర్ల దూరం నుంచి బాలిస్టిక్ క్షిపణులు, విమానాలను గుర్తించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ టెక్నాలజీ చైనా, దక్షిణ ఆసియా, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో ముప్పులను ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది.

Helicopter Equipment: భారత్‌కు రూ.9,900 కోట్ల రక్షణ ఉత్పత్తులు.. అమెరికా అంగీకారం

ఈ ఒప్పందంతో భారతదేశం తన రక్షణ సామర్థ్యాలను మరింత పెంచుకోనుంది. ఇలాంటి అధునాతన రాడార్ వ్యవస్థలు ఇప్పటివరకు కొన్నిచేప్పు దేశాలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

మేకిన్ ఇండియా అభియాన్ భాగంగా, ఈ రాడార్ వ్యవస్థలో 60% భాగం భారతీయ కంపెనీలతో ఉత్పత్తి చేయబడనుంది. ఈ వ్యవస్థను కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గలో ఇన్‌స్టాల్ చేయాలని నిర్ణయించారు, అక్కడ ఇప్పటికే ఆధునిక డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ సౌకర్యాలు ఉన్నాయి.

India-Guyana Relations: గయానాతో 10 ఒప్పందాలు కుదుర్చుకున్న మోదీ..

Published date : 11 Dec 2024 12:51PM

Photo Stories