Skip to main content

TeamLease Digital Report: మహిళా టెకీలకు డిమాండ్‌

TeamLease Digital Report

ముంబై: వచ్చే మూడేళ్లలో (2027 నాటికి) టెక్‌యేతర వ్యాపారాల్లో మహిళా టెకీల పాత్ర దాదాపు పాతిక శాతం మేర వృద్ధి చెందవచ్చని అంచనాలు నెలకొన్నాయి. ఈ ధోరణి అన్ని స్థాయుల్లో (ఫ్రెషర్లు, జూనియర్, మిడ్‌–సీనియర్, లీడర్‌షిప్, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌) ఉండనుంది. టీమ్‌లీజ్‌ డిజిటల్‌ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

దీని ప్రకారం 2023లో నాన్‌–టెక్‌ పరిశ్రమల్లో టెక్నాలజీ విధులు నిర్వర్తిస్తున్న మహిళల సంఖ్య 19.4 లక్షలుగా ఉండగా ఇది 2027 నాటికి 24.3 శాతం పెరిగి 24.1 లక్షలకు చేరనుంది. నాన్‌–టెక్‌ రంగాల్లో పని చేస్తున్న మొత్తం మహిళా సిబ్బందిలో 0.5 శాతం మంది మాత్రమే టెక్‌ ఉద్యోగ విధుల్లో ఉన్నారని, ఈ విభాగంలో వారి వాటా మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది.

టెక్నాలజీలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుండటం, మహిళల ఆధారిత కార్యక్రమాలు జరుగుతుండటం వంటి అంశాల ఊ తంతో ఈ ఏడాది మహిళా టెకీల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వివరించింది. రాష్ట్రాల వారీగా చూస్తే రాబోయే నెలల్లో మహిళల నియామకాలు మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌లో అధికంగా ఉండనున్నాయి. చెన్నై, పుణె, నాసిక్, కోయంబత్తూర్, కోచి, ఔరంగాబాద్, వదోదర వంటి నగరాల్లో హైరింగ్‌ ఎక్కువగా ఉంది.
 

Published date : 18 Apr 2024 07:27PM

Photo Stories