NVS Recruitment 2024: నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ పోస్టులు.. పది పాసైన వారూ అర్హులే..

ఈ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయబడతాయి.
మొత్తం: 1,377 పోస్టులు
ఖాళీల వివరాలు:
- ఫిమేల్ స్టాఫ్ నర్స్: 121
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 5
- ఆడిట్ అసిస్టెంట్: 12
- జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్: 4
- లీగల్ అసిస్టెంట్: 1
- స్టెనోగ్రాఫర్: 23
- కంప్యూటర్ ఆపరేటర్: 2
- క్యాటరింగ్ సూపర్‌వైజర్: 78
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 381
- ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్: 128
- ల్యాబ్ అటెండెంట్: 161
- మెస్ హెల్పర్: 442
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 19
అర్హులు వీరే..
పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
అనంతపురం, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్
దరఖాస్తు విధానం:
ఆసక్తిగల అభ్యర్థులు కేంద్రీయ విద్యాలయ సమితి వెబ్‌సైట్ navodaya.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులు..
- జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్: రూ. 1500
- ఎస్సీ/ఎస్టీ/PwBD: రూ. 500
ఇతర పోస్టులు:
- అందరికీ: రూ. 1000
- ఎస్సీ/ఎస్టీ/PwBD: రూ. 500
గమనిక: ఆన్‌లైన్ దరఖాస్తు, పరీక్ష తేదీలు త్వరలో వెల్లడి కానున్నాయి.