Skip to main content

Anganwadi Jobs: అంగన్‌వాడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. చివరి తేదీ ఇదే

ICDS PD Nagashailaja  Vacant Anganwadi Posts in Chittoor District  Anganwadi Jobs  Chittoor District Anganwadi Recruitment Announcement

చిత్తూరు కలెక్టరేట్‌: జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టులకు అర్హత, ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్‌ పీడీ నాగశైలజ తెలిపారు. సోమవారం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న పలు కేడర్‌ల పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు.

ఇందులో అంగన్‌వాడీ కార్యకర్త పోస్టులు 11, మినీ కార్యకర్త–18, హెల్పర్‌–58 మొత్తం 87 పోస్టులు ఉన్నాయని వెల్లడించారు. సంబంధిత పోస్టుల ఖాళీల వివరాలను జిల్లాలోని అన్ని సీడీపీఓ కార్యాలయాలకు పంపినట్లు చెప్పారు.

Free Civils Coaching in Hyderabad: సివిల్స్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా శిక్షణ.. చివరి తేదీ ఎప్పుడంటే..

అంగన్‌వాడీ కేంద్రం, గ్రామ, వార్డు సచివాలయ పరిధిలోని పదోతరగతి పూర్తి చేసిన వివాహిత మహిళలు ఈ నెల 4 నుంచి 19 వ తేదీలోపు సీడీపీఓ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలకు సీడీపీఓ కార్యాలయాల్లో సంప్రదించాలని కోరారు.
 

Published date : 02 Jul 2024 03:18PM

Photo Stories