Skip to main content

Job Mela: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో జాబ్‌మేళా.. ఎప్పుడు? ఎక్కడంటే..

మురళీనగర్‌: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో భీమిలి ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈ నెల 17న జాబ్‌మేళా నిర్వహిస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి టి.చాముండేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్‌ మేళాలో మేధా సర్వో డ్రైవ్‌, క్లోవ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అపోలో ఫార్మసీ, ఆస్త్రా మోటార్స్‌ కంపెనీలు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు.
Job Mela   Job fair announcement at Bhimili Government Women's Polytechnic College   Bhimili Government Women's Polytechnic College hosting a job fair
Job Mela Job Mela for Unemployed youth

● మేధా సర్వో కంపెనీ ఐటీఐ ఫిట్టర్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రీషియన్‌, మెషినిస్ట్‌ పూర్తి చేసిన 25 ఏళ్ల లోపు యువకులకు రూ.15 వేల ఉపకారవేతనంతో అప్రెంటిస్‌షిప్‌కు అవకాశం కల్పిస్తుంది. డిప్లమోలో ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ అర్హత ఉన్న వారికి అప్రెంటిస్‌షిప్‌ కాలంలో నెలకు రూ.16వేల స్టైఫండ్‌ చెల్లిస్తారు. అప్రెంటిస్‌షిప్‌ కాకుండా ఇదే కంపెనీలో ఉద్యోగం చేయాలనుకునే డిప్లమో లేదా బీటెక్‌లో ఈసీఈ, ఈఈఈ, ఈఐఐ పూర్తి చేసిన అభ్యర్థులకు నెలకు రూ.26,600 జీతం ఇస్తారు.

Job Mela For Freshers: రేపు జాబ్‌మేళా.. పూర్తివివరాల కోసం క్లిక్‌ చేయండి

● క్లోవ్‌ టెక్నాలజీస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌లో రివిట్‌ మోడలర్‌ ఉద్యోగాలకు బీటెక్‌ సివిల్‌, మెకానికల్‌ పూర్తి చేసిన యువకులు అర్హులు.

● అపోలో ఫార్మసీలో ఫార్మసిస్టు, ఫార్మసీ ట్రైనీ ఉద్యోగాలకు బి–ఫార్మసీ, డి–ఫార్మసీ, ఎం–ఫార్మసీ, ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు పాల్గొనవచ్చు.

మెగా జాబ్ మేళా|Trending Mega job mela | Sakshi Education

Job Fair 2024 For Freshers: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగం

● ఆస్త్రా మోటార్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ చదివిన యువకులు అర్హులు. ఎంపికై న అభ్యర్థులు విశాఖపట్నం, హైదరాబాద్‌, కాకినాడలో పనిచేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు 90147 58949 సంప్రదించవచ్చు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 16 Dec 2024 12:16PM

Photo Stories