Skip to main content

Free Civils Coaching in Hyderabad: సివిల్స్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా శిక్షణ.. చివరి తేదీ ఎప్పుడంటే..

Written Test Selection for Civil Services Coaching  Mahbubnagar ZP Center Civil Services Preparation  Free Coaching for Civil Services in Hyderabad   Mahbubnagar ZP Center Civil Services Preparation  Free Civils Coaching in Hyderabad  Civil Services Exam Training Announcement

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): సివిల్స్‌ ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారని పేర్కొన్నారు.

అభ్యర్థులు జనరల్‌/ప్రొఫెషనల్‌ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలని.. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 3 లక్షలకు మించరాదని తెలిపారు. ఈనెల 21వ తేదీన హైదరాబాద్‌లో అర్హత పరీక్ష ఉంటుందన్నారు. అభ్యర్థులకు వచ్చిన మెరిట్‌ ఆధారంగా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పద్ధతి అనగా ఎస్సీలకు 75 శాతం, ఎస్టీలకు 10, బీసీలకు 15 శాతం ప్రకారం ఎంపిక చేస్తారన్నారు.

HCL Recruitment 2024: హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల..

అమ్మాయిలకు 33.33 శాతం సీట్లు రిజర్వు అయి ఉంటాయన్నారు. ఎంపికై న అభ్యర్థులకు 10 నెలలపాటు ఉచితంగా సీ శ్యాట్‌ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు http://tsstudycircle. co.in వెబ్‌సైట్‌లో ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 040–23546552, 98859 29862, 89773 40006 నంబర్లను సంప్రదించాలని కోరారు.

Published date : 02 Jul 2024 03:08PM

Photo Stories