RRB Technician Recruitment 2024: రైల్వేలో 9,000 టెక్నికల్ పోస్టులకు నోటిఫికేషన్.. ఎప్పుడంటే..
Sakshi Education
భారతీయ రైల్వే నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది.

త్వరలో దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్‌ల పరిధిలో 9,000 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన నియామక షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. ఫిబ్రవరి నెలలోనే ఉద్యోగ ప్రకటన వెలువడనుంది.

దీని ప్రకారం 2024 మార్చి/ఏప్రిల్‌లో ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులకు అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించి, 2025 ఫిబ్రవరిలో ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.
Railway Jobs 2024: రైల్వేలో 1646 యాక్ట్ అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..
Published date : 01 Feb 2024 02:59PM