Mega Job Mela: నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి..

సాక్షి,పాడేరు: చింతూరులో ఈనెల 27న నిర్వహించే మెగా జాబ్‌మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఎం.విజయసునీత కోరారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం, సీడాప్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్‌మేళా ప్రచార పోస్టర్‌ను కలెక్టర్ తన ఛాంబర్‌లో గురువారం సాయంత్రం ఆవిష్కరించారు.
Open University Fees: ఓపెన్ వర్సిటీలో ప్రవేశానికి ఫీజు గడువు పొడిగింపు
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 27వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చింతూరు సమీపంలోని ఎర్రంపేట గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో మెగా జాబ్ మేళా జరుగుతుందన్నారు. మెడికల్, ఆటోమొబైల్, లాజిస్టిక్, ఇతర రంగాలకు చెందిన ఎనిమిది కంపెనీల ప్రతినిధులు ఈ జాబ్ మేళాకు హాజరవుతారన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇతర ఉన్నత విద్య అభ్యసించి, 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు ఈ మేళాకు హాజరుకావాలని ఆమె కోరారు.
Online Applications: ప్రతిభ విద్యాలయాల్లో ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు..
అభ్యర్థులు విద్యార్హత ధ్రువపత్రాలతో పాటు పాన్, ఆధార్‌కార్డు జెరాక్స్ కాపీలను ఇంటర్వ్యూలకు తీసుకురావాలని ఆమె సూచించారు. ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.10వేల నుంచి రూ.20వేల వేతనం ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థను 6304634447 నంబరులో సంప్రదించాలని కలెక్టర్ కోరారు.