Aryan Roshan: ఐఐటీలో సీటు.. ఫీజు చెల్లించలేని దుస్థితి
ఫీజు చెల్లిం చేస్థోమత లేక దాతల కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నాడు. అయితే శుక్రవారమే చివరి తేదీ కావడంతో సీటు వదులుకోవాల్సి వస్తుందనే భయంతో రోషన్ కన్నీటి పర్యంతం అవుతు న్నాడు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నకిర కొమ్ముల గ్రామానికి చెందిన ఆర్యన్ రోషన్కు చిన్నతనంలోనే తండ్రి మరణించాడు.
చదవండి: JEE Main 2024: జేఈఈ మెయిన్‌లో సిలబస్ మార్పులు... సన్నద్ధత ఇలా!
తల్లి రోజు వారి కూలీ చేస్తూ జీవనం సాగిస్తోంది. 5వ తరగతిలో సాంఘిక సంక్షేమ గురు కుల పాఠశాలలో చేరిన రోషన్ ఇంటర్ వరకు అక్కడే చదు వుకున్నాడు. ఇటీవల జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో రోషన్ ఎస్సీ కేటగిరీలో 2406 ర్యాంకును సాధించాడు. జోసా కౌన్సెలింగ్లో మొదటి రౌండ్లోనే ఐఐటీ తిరుపతిలో కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో సీటు సాధిం చాడు.
చదవండి: ఐఐటీ- గువహటిలో మౌలిక వసతులు, భోధన విధానం...
ఈ కోర్సుకు ఏటా లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుండగా, నాలుగు సంవత్సరాల బీటెక్ కోర్సుకు సుమారు రూ.4 లక్షల ఖర్చు అవుతుంది. అయితే ఆర్థిక పరిస్థితి బాగా లేకపో వడంతో రోషన్ దాతల కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రభుత్వం స్పందించి తనకు ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నాడు. దాతలు 9866126281 ఫోన్ నంబర్లో సంప్రదించాలని రోషన్ వేడుకుంటున్నాడు.