Skip to main content

Lavudya Devi: ‘సాక్షి’ కథనానికి స్పందించిన మంత్రి.. పేద విద్యార్థిని కాలేజీ ఫీజుకు భరోసా

హుస్నాబాద్‌ రూరల్‌: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం భల్లునాయక్‌ తండాకు చెందిన పేద విద్యార్థిని లావుడ్య దేవి ఓ ప్రైవేటు మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు సాధించినా ఆర్థిక స్థోమత లేక కూలి పనులకు వెళ్తోంది.
ponnam prabhakar assured the poor student for medical fees  Minister's response to student’s financial struggle for MBBS studies

దీనిపై ‘సాక్షి’ అక్టోబర్ 28న సంచికలో ‘డాక్టర్‌ చదువుకు డబ్బుల్లేక కూలి పనులకు..’ శీర్షికన కథనం ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ గిరిజన విద్యార్థి కుటుంబం గురించి స్థానిక నాయకులతో అరా తీశారు.

చదవండి: Lavudya Devi: డాక్టర్‌ చదువుకు డబ్బుల్లేక.. కూలి పనులకు.. సీటొచ్చినా.. ఫీజు కట్టలేని అడవి బిడ్డ

అక్టోబర్ 29న హుస్నాబాద్‌కు వచ్చిన మంత్రి.. గిరిజన విద్యార్థిని అభినందించారు. ఆమె కాలేజీ ఫీజుకు ఆర్థిక సాయంతో చేయడంతోపాటు హాస్టల్‌ ఫీజు చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. వచ్చే ఏడాదికి కూడా కాలేజీ ఫీజుకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

Published date : 30 Oct 2024 01:02PM

Photo Stories