Skip to main content

Nursing Jobs: నర్సింగ్‌ ఉద్యోగ అవకాశాలు.. అర్హులైన‌ అభ్యర్థులకు ఉచిత శిక్ష‌ణ‌

నంద్యాల(న్యూటౌన్‌): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నవీస్‌ హెచ్‌ఆర్‌ ఆధ్వర్యంలో ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పీవీ ప్రతాపరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
Nandyala Newtown District Skill Development Officer PV Prathapara Reddy   Nursing Job Opportunities    Job Opportunity Announcement   Andhra Pradesh State Skill Development Organization

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జపానీస్‌ బాష, ఎన్‌ఎస్‌ ఎన్‌–4, ఎన్‌–3 స్థాయిలో నేర్పించి జపాన్‌ దేశంలో నర్సులుగా ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. 32 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. శిక్షణ కాలం నవీస్‌ హెచ్‌ఆర్‌ బెంగుళూరులో ఆరునెలల పాటు శిక్షణ జరుగుతుందన్నారు. శిక్షణ ఫీజు రూ.3 లక్షలుగా నిర్దేశించారని, పాక్షిక శిక్షణ రుసుం రూ. 50 వేలు కాగా ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ రూ.25 వేలు చెల్లిస్తుందన్నారు. మిగిలిన రూ.25 వేలు అభ్యర్థులే చెల్లించాలన్నారు. మిగిలిన రూ.2.50 లక్షలు మూడు విడతలుగా అభ్యర్థి చెల్లించాలన్నారు.
శిక్షణ పూర్తి చేసుకున్న వారికి జపాన్‌ దేశంలో ఉద్యోగ అవకాశం కల్పించడానికి అన్ని సదుపాయాలు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నవీస్‌ హెచ్‌ఆర్‌ కల్పిస్తుందన్నా రు. ఉద్యోగం పొందిన అభ్యర్థి జీతం రూ.1.10 లక్షలు నుంచి రూ.1.40 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు వెబ్‌సైట్‌ https://www.apssdc.in//home/online program registration వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 8498070087ను సంప్రదించాలన్నారు.

Physiotherapist Jobs: ఫిజియోథెరపిస్ట్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Published date : 14 Mar 2024 10:39AM

Photo Stories