Physiotherapist Jobs: ఫిజియోథెరపిస్ట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
విజయనగరం అర్బన్: జిల్లాలో రెండు భవిత క్లస్టర్‌లలో ఖాళీగా ఉన్న ఫిజియోథెరపిస్ట్ పోస్టులకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని డీఈఓ ఎన్.ప్రేమకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఫిజియోథెరపి డిగ్రీ (బీపీటీ)/ఎంపీటీ విద్యార్హత ఉన్న స్థానికులు అర్హులవుతారని తెలిపారు. క్యాంపు ఒక్కింటికీ రూ.వెయ్యి చొప్పున నెలకు 12 క్యాంపులు నిర్వహించే విధంగా అవర్స్ బేస్‌గా పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 9, 10 తేదీలలో దరఖాస్తులను ‘విజయనగరం.ఎన్‌ఐసీ.ఐఎన్’ వెబ్‌సైట్ ద్వారా పొందుపరచవచ్చని, పూర్తి చేసిన దధరఖాస్తులను జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
Published date : 09 Mar 2024 03:09PM