Mini Job Mela: రేపు కలెక్టరేట్ కార్యాలయంలో మినీ జాబ్ మేళా..

డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ అధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈనెల 14న కలెక్టరేట్ కార్యాలయంలో మినీ జాబ్‌మేళా డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధికారి కె.సంజీవరావు సోమవారం వెల్లడించారు. కలెక్టర్ ఎల్.శివశంకర్ ఆదేశాల మేరకు నిర్వహించే ఈ జాబ్‌మేళాలో ఉదయం 9.30 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. మేళాలో రెండు కంపెనీలు పాల్గొంటాయన్నాయనీ, అభ్యర్థుల విద్యార్హతను బట్టి జీతం సుమారుగా రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు.
JEE Main 2024 Scorecard Released: 100 స్కోర్ చేసిన టాపర్స్ వీళ్ళే... ఎక్కువ మంది తెలంగాణ వాళ్ళే!!
ఎస్సెస్సీ, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఫార్మసీ, పీజీ వరకు చదువుకున్న 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయస్సు మధ్య గల నిరుద్యోగ యువతి యువకులు వారి బయోడేటా, రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ జిరాక్స్, ఆధార్ నకలు, పాస్‌పోర్ట్ ఫోటోతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు. వివరాలకు ఎ.రమ్య 83285 44388, ఎం.వీరాంజనేయులు 9160200652 సంప్రదించాలని కోరారు. ఆసక్తిగల యువతీ యువకులు ముందుగా www.aprrdc.i n అనే వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు.