Free Training: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగం
చిలకలపూడి(మచిలీపట్నం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఫెడరల్ స్కిల్ అకాడమీ ట్రైనింగ్ సెంటర్‌లో ఉచిత శిక్షణ, కచ్చితమైన ఉద్యోగావకాశాల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ట్యాలీ కోర్సుపై సర్టిఫికెట్‌తో కూడిన ఉచిత శిక్షణతో పాటు కచ్చితమైన ఉద్యోగావకాశం కల్పిస్తారన్నారు.
AP EAPCET Final Phase Counselling: ఇంజనీరింగ్ చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్.. ముఖ్యమైన తేదీలు
బీకాం, బీఏ, బీబీఏ, ఎం.కామ్ పూర్తి చేసిన 18 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో కౌన్సెలింగ్, తదుపరి శిక్షణ తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. శిక్షణ అనంతరం ప్రముఖ ప్రైవేటు రంగ సంస్థలలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా కానూరు తులసీనగర్‌లోని ఫెడరల్ స్కిల్ అకాడమీ ట్రైనింగ్ సెంటర్‌కు తమ విద్యార్హత ధ్రువపత్రాలతో పాటు, ఆధార్‌కాపీ, పాస్‌పోర్టు సైజు ఫొటోలతో నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం 8714692747లో సంప్రదించాలన్నారు.
Tags
- latest jobs
- Latest Jobs News
- Free training
- Free training for unemployed youth
- free courses
- Training Centres
- latest jobs in telugu
- latest job news
- latest job notification in telugu
- DistrictSkillDevelopmentOfficer
- SrinivasaRao
- FreeTrainingClasses
- JobOpportunities
- FederalSkillAcademy
- AndhraPradeshSkillDevelopment
- TallyCourses
- TrainingCertificate
- SkillDevelopment
- Machilipatnam
- Skill training courses
- CareerGrowth
- SakshiEducationUpdates