Skip to main content

AP EAPCET Final Phase Counselling: ఇంజనీరింగ్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌.. ముఖ్యమైన తేదీలు

AP EAPCET Final Phase Counselling

ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశా­లకు నిర్వహించిన ఏపీఈఏపీ సెట్‌–2024 తది విడత కౌన్సెలింగ్‌ మొదలయ్యింది. ఇవాళ్టి(జులై 23) నుంచి  ప్రారంభమైన రిజిస్ట్రేషన్, వెబ్‌ కౌన్సెలింగ్‌  ప్రక్రియ  ఈ నెల 27తో ముగుస్తుంది. ఆన్ లైన్ లో అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్లను జులై 26 తేదీ లోపు నోటిఫైడ్ హెల్ప్‌లైన్ సెంటర్లలో వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

అర్హులైన అభ్యర్థులు జులై 24 నుంచి జులై 26 వరకు వెబ్ఆప్షన్‌లను నమోదు చేసుకోవాలి. వెబ్ ఆప్షన్ల మార్పునకు జూలై 27న అవకాశం కల్పిస్తారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ / CBSE / ICSE / NATIONAL OPEN SCHOOL / APOSS ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. ఇంటర్ లో ఎంపీసీ సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

TG EAPCET 2024 Second Phase Counselling Schedule: ఈనెల 26నుంచి ఇంజనీరింగ్‌ రెండో విడత కౌన్సెలింగ్‌

ఓసీ విద్యార్థులు 44.5 శాతం, రిజర్వుడు కేటగిరీలు(బీసీ, ఎస్సీ, ఎస్టీ) అభ్యర్థులు 39.5 శాతం గ్రూప్ సబ్జెక్టులలో మార్కులు పొందాల్సి ఉంటుంది. ఏపీఈఏపీ సెట్‌లో మొదటి విడత కౌన్సెలింగ్‌కు హాజరు కానివారు ఇప్పుడు చివరి విడత కౌన్సెలింగ్‌లో హాజరు కావొచ్చు.అంతేకాకుండా మొదటి కౌన్సెలింగ్‌లో సీటు లభించిన వారికి కళాశాల, బ్రాంచ్‌లు మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. 


చివరి విడత కౌన్సెలింగ్‌..ముఖ్యమైన తేదీలు ఇవే

  1. ప్రాసెసింగ్‌ ఫీజు, రిజిస్ట్రేషన్‌, సర్టిఫికేషన్‌ వెరిఫికేషన్‌: జులై 23- 25 వరకు
  2. హెల్ప్ లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్(ఆఫ్‌లైన్)/ఆన్‌లైన్ : జులై 23 నుంచి జులై 26 వరకు
  3. వెబ్ ఆప్షన్ల ఎంపిక : జులై 24 నుంచి జులై 26 వరకు
  4. వెబ్ ఆప్షన్ల ఎంపిక మార్పు : జులై 27
  5. సీట్ల కేటాయింపు : జులై 30
  6. కాలేజీల్లో రిపోర్టింగ్ : జులై 31 నుంచి ఆగస్టు 03 వరకు
Published date : 23 Jul 2024 05:13PM

Photo Stories