Skip to main content

TG EAPCET 2024 Second Phase Counselling Schedule: ఈనెల 26నుంచి ఇంజనీరింగ్‌ రెండో విడత కౌన్సెలింగ్‌

Second round seat allotment on July 31  Third round of counseling starting from August 8  TG EAPCET 2024 Second Phase Counselling Schedule Telangana EAMCET second round of engineering counseling schedule Verification of certificates on July 27 Second round of web options on July 27 and 28

తెలంగాణ ఎంసెట్‌ అభ్యర్థులకు అలర్ట్‌. ఇంజనీరింగ్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఈనెల 26 నుంచి ప్రారంభం కానుంది.జులై 27న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేపడతారు. జులై 27, 28 తేదీల్లో రెండో విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు.  జులై 31న ఇంజినీరింగ్‌ రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి చేసి ఆ తర్వాత ఆగస్టు 8 నుంచి మూడో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభిస్తారు.

Union Budget 2024-25 Live Updates: కొత్తగా ఉద్యోగం వచ్చిన వారికి అదనంగా 15వేలు ఇవ్వనున్న కేంద్రం

ఆగస్టు 9న మూడో విడత కౌన్సెలింగ్‌కు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేపట్టి.. 9, 10 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. ఆగస్టు 13న ఇంజినీరింగ్‌ మూడో విడత సీట్ల కేటాయింపు నిర్వహిస్తారు. ఇప్పటికే ఇంజినీరింగ్‌ సీట్ల తొలి విడత కౌన్సెలింగ్‌లో 86 శాతం సీట్లు భర్తీ అయిన విషయం తెలిసిందే.

TG LAWCET 2024 Counseling Schedule: లా ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

ఈ ఏడాది కన్వీనర్‌ కోటాలో మొత్తం 245 కళాశాలల్లో 1,36,660 సీట్లు ఉండగా తొలి దశలో 1,17,136 సీట్లు భర్తీ అయ్యాయి. దీంతో మిగిలిన సీట్లకు జులై 26 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఫస్ట్‌ కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారు, లేదా సీటు వచ్చిన కాలేజీలో ఇంకా చేరని అభ్యర్థులు సెకండ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. 

కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు.. ఇవి గుర్తించుకోండి:

 

  • మొదటి కౌన్సెలింగ్‌లో వచ్చిన సీటుతో సంతృప్తి చెందిన వారు సెకండ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనొచ్చు.
  • కౌన్సెలింగ్‌ అనంతరం అలాట్‌మెంట్‌లో మీకు కేటాయించిన కాలేజీలో తప్పకుండా రిపోర్ట్‌ చేయాలి. లేదంటే సీటు కోల్పోతారు.
  • సీటు వచ్చిన కాలేజీలో మీ సర్టిఫికేట్స్‌ జిరాక్స్‌, ఒరిజినల్‌ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది
  • సెకండ్‌ కౌన్సెలింగ్‌లో వచ్చిన సీటు కూడా నచ్చకపోతే మూడవ కౌన్సెలింగ్‌కు హాజరుకావొచ్చు.

 

Published date : 24 Jul 2024 08:53AM

Photo Stories