DEE SET 2024 Certificate Verification: రేపట్నుంచి డీఈఈ సెట్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్.. పూర్తి వివరాలివే!
Sakshi Education
రామగిరి(నల్లగొండ) : డీఈఈ సెట్ 2024 సెకండ్ ఫేజ్ సర్టిఫికెట్ల పరిశీలన డిసెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని నల్లగొండ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ కె.నర్సింహ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
DEE SET 2024 Certificate Verification
నల్లగొండలోని డైట్ కళాశాలలో డిసెంబర్ 5వ తేదీన సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. 7 నుంచి 9 వరకు ర్యాంకుల ప్రకారం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, 13వ తేదీన సీట్ల కేటాయించనున్నామని తెలిపారు. సీటు పొందిన వారు 13 నుంచి 17వ తేదీ వరకు కాలేజీలో రిపోర్టు చేయాలని సూచించారు.