APEAP CET 2024 : ఏపీఈఏపీ సెట్–2024 ఎంపీసీ, బైపీసీ స్ట్రీమ్‌లకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
గుంటూరు: ఎంపీసీ స్ట్రీమ్‌లో బీ.ఫార్మసీ, ఫార్మా–డీ కోర్సులతోపాటు బైపీసీ స్ట్రీమ్‌లో బీఈ, బీ.టెక్‌లలో బయో టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, బీ.ఫార్మసీ, ఫార్మా–డీ కోర్సుల సీట్ల భర్తీ కోసం వెబ్ కౌన్సెలింగ్ నిర్వహణకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేశాయి.
Studying In America: అమెరికాలో భారత విద్యార్థులే టాప్.. ఆ కోర్సుల్లో ఎక్కువగా అడ్మిషన్స్
ఏపీ ఈఏపీసెట్–2024లో అర్హత సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చొప్పున https://eapcet-sche.aptonline.in/EAPCET/ లో లాగిన్ అయ్యి క్రెడిట్ కార్డు, డెబిట్‌కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించేందుకు శనివారం రాత్రి వరకు అవకాశం ఉంది.
డిసెంబర్ ఒకటో తేదీ వరకు విద్యార్థులు అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్లను ఎంపిక చేసిన హెల్ప్‌లైన్ కేంద్రంలో పరిశీలిస్తారు. శని, ఆదివారాల్లో కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. వెబ్ ఆప్షన్లు మార్చుకునేందుకు డిసెంబర్ 2వ తేదీ ఒక్క రోజు అవకాశం ఉండగా, 4వ తేదీన సీట్లు కేటాయిస్తారు. డిసెంబర్ 4 నుంచి ఆరో తేదీలోపు కళాశాలల్లో చేరాల్సి ఉంది. బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులు శనివారం నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
డిసెంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. కళాశాలల ఎంపిక కోసం 3 నుంచి 7వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. 8వ తేదీన వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చు. డిసెంబర్ 11 సీట్లను కేటాయిస్తారు. అదే రోజు నుంచి 14వ తేదీలోపు కళాశాలల్లో చేరాలి.
Tags
- apeapcet 2024
- Admissions counselling
- Pharmacy Courses
- engineering and agricultural courses
- admission tests for various courses
- apeapcet counselling schedule
- online applications for apeapcet counselling
- web options
- mpc and bipc streams
- State Technical Education Department
- Higher Education Council
- Education News
- Sakshi Education News