TG LAWCET 2024 Counseling Schedule: లా ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి నేతృత్వంలోని ‘సెట్’ ప్రవే శాల కమిటీ సమా వేశం జూలై 12న మండలి కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు.
చదవండి: International Law: పాలస్తీనాను అధీనంలో ఉంచుకోవడం చట్టవిరుద్ధం
బుధవారం లాసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ సమా వేశంలో మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఎస్‌కే మహమూద్, ప్రొఫెసర్ వి.వెంకటరమణ, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, సెట్ కన్వీనర్ పి.రమేష్‌బాబు పాల్గొన్నారు.
చదవండి: Job Reservation Bill: రాష్ట్రాన్ని విడిచివెళ్లనున్న టెక్ కంపెనీలు.. కారణం ఇదే..
రాష్ట్రంలోని 11 లా కాలేజీలు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొంటాయి. వీటిలో మూడేళ్ల లా కోర్సులో 4,790 సీట్లు, ఐదేళ్ల లా కోర్సులో 2,160, ఎల్‌ఎల్‌ఎంలో 990 సీట్లున్నాయి.
లా ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్
తేదీ |
విషయం |
24–7–24 |
నోటిఫికేషన్ విడుదల |
5–8–24 – 20–8–24 |
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన |
7–8–24 – 10–8–24 |
స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన |
21–8–24 |
అర్హుల జాబితా ప్రకటన, మార్పులు చేర్పులకు అవకాశం |
22–8–24 – 23–8–24 |
తొలి విడతకు ఆప్షన్లు ఇవ్వడం |
24.8.24 |
ఆప్షన్లు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం |
27–8–24 |
సీట్ల కేటాయింపు |
28–8–24 – 30–8–24 |
కాలేజీలో రిపోర్టింగ్ |