Skip to main content

Union Budget 2024-25 Live Updates: కొత్తగా ఉద్యోగం వచ్చిన వారికి అదనంగా 15వేలు ఇవ్వనున్న కేంద్రం

Union Budget 2024-25 Live Updates

కేంద్ర బడ్జెట్‌ 2024-25 ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వరుసగా ఏడోసారి బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు సమర్పించారు.

Budget 2024-25 Live Updates: కేంద్ర బడ్జెట్ సమావేశాలు.. అప్‌డేట్స్ ఇవే..

మోదీ మూడో విడత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో యువతను ఆకట్టుకునే దిశగా కొత్త పథకాలను ప్రకటించింది కేంద్రం. ఉపాధిని ప్రోత్సహించేందుకు కొత్త ఉద్యోగులకు, యాజమాన్యాలకు ఆర్థిక తోడ్పాటును అందిస్తూ మూడు స్కీములను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

మూడు స్కీములు ఇవే..
స్కీమ్‌-ఎ: ఈపీఎఫ్‌వోలో నమోదైన కొత్త ఉద్యోగులకు రూ.15000 వరకు ఒక నెల జీతం. మూడు విడతల్లో చెల్లింపు

స్కీమ్‌-బి: మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ రంగంలో ఉద్యోగులకు, యాజమాన్యాలకు ప్రోత్సాహకాలు. మొదటి నాలుగేళ్ల పాటు ఈపీఎఫ్‌వో కాంట్రిబ్యూషన్‌ ఆధారంగా చెల్లింపు

స్కీమ్‌-సి: అధికంగా ఉద్యోగులను చేర్చుకున్న యాజమాన్యాలకు రెండేళ్లపాటు రూ.3000 వరకు ఈపీఎఫ్‌వో కాంట్రిబ్యూషన్‌ రీయింబర్స్‌మెంట్‌

Published date : 23 Jul 2024 01:26PM

Photo Stories