Skip to main content

Budget 2024-25 Live Updates: కేంద్ర బడ్జెట్ సమావేశాలు.. అప్‌డేట్స్ ఇవే..

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23వ తేదీ ఆర్థిక సంవత్సరం 2024-25కు సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Union Budget 2024-25 Live Updates and Highlights in Telugu Nirmala Sitharaman presenting the annual budget Nirmala Sitharaman at the budget presentation for FY 2024-25  Finance Minister Nirmala Sitharaman discussing the 2024-25 budget  Budget announcement by Nirmala Sitharaman for the financial year 2024-25  Nirmala Sitharaman delivering the annual budget speech  Union Budget 2024-25
కేంద్ర బడ్జెట్ సమావేశాల అప్‌డేట్స్ ఇవే..

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ దేశ చరిత్రలో ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ రికార్డు నెలకొల్పారు.

బడ్జెట్ ముఖ్యాంశాలు ఇవే..

కొత్త పన్ను విధానంలో మార్పులు.. రూ.3 లక్షలలోపు ఎలాంటి పన్ను లేదు. రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షలలోపు 5 శాతం, రూ.7 లక్షలు-రూ.10 లక్షలలోపు 10%, రూ.10 లక్షలు-రూ.12 లక్షలలోపు 15%, రూ.12 లక్షలు-రూ.15 లక్షలలోపు 20%, రూ.15 లక్షలు అంతకంటే ఎక్కువ ఉంటే 30% పన్ను చెల్లించాలి. మొత్తంగా పన్నుదారులు రూ.17,500 మిగుల్చుకునే అవకాశం.

➤ పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కి పెంపు.
➤ ట్రేడింగ్‌ మార్కెట్‌లో ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్లపై ఎస్‌టీటీ వరుసగా 0.02%, 0.01%కి పెంపు.
➤ దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5 శాతం పన్ను.
➤ క్యాపిటల్‌ కనిష్ఠ పరిమితి రూ.1.25 లక్షలు.
➤ స్టార్టప్‌ల కంపెనీలకు ప్రోత్సాహకం.. ఏంజెల్‌ ట్యాక్స్‌ రద్దు.

➤ బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం 6 శాతం, ప్లాటినంపై 6.4 శాతం తగ్గింపు.
➤ మొబైల్, యాక్ససరీస్‌పై 15 శాతం దిగుమతి సుంకం తగ్గింపు.
➤ జీఎస్టీలో పన్నుల నిర్మాణాన్ని హేతుబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. సామాన్యులకు జీఎ‍స్టీ వల్ల గణనీయంగా లాభం చేకూరింది. జీఎస్టీ ప్రయోజనాలను మరింత మెరుగుపరచడానికి పన్ను నిర్మాణంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నిస్తాం.

➤ ఆర్థిక ద్రవ్యలోటు జీడీపీలో 4.9%గా ఉంది.
➤ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
➤ కాశీ విశ్వనాథ్ ఆలయం, నలంద, విష్ణుపాద్, మహాబోధి ఆలయం వంటి ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రత్యేక కారిడార్ల ఏర్పాటు.

➢ రాబోయే 10 సంవత్సరాలలో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను ఐదు రెట్లు విస్తరిస్తాం.
➢ ఈ లక్ష్యానికి చేరుకోవడానికి రూ.1,000 కోట్ల క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేస్తాం.
➢ ఫిబ్రవరిలో ప్రకటించిన విధంగా రూ.1 లక్ష కోట్ల ఫండ్‌తో ప్రైవేట్ ఆధారిత పరిశోధనలను ప్రోత్సహించడానికి ఒక యంత్రాంగాన్ని రూపొందిస్తాం.
➢ చిన్న, మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్‌ల అభివృద్ధి.
➢ ఇందుకు ప్రభుత్వం ప్రైవేట్ రంగంతో కలిసి పనిచేస్తుంది. న్యూక్లియర్ ఎనర్జీ కోసం కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయాల్సి ఉంది.

➢ నేపాల్‌లో వరదలను నియంత్రించేలా మరిన్ని నిర్మాణాలు చేపట్టాలి. అసోం, బీహార్‌లోనూ తరచు వరదలు సంభవిస్తాయి. వరదల వల్ల హిమాచల్ ప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుంది. కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తుల నిర్వహణకు రూ.11,500 కోట్లు ఆర్థికసాయం.

➣ ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి సంబంధించి విధాన పత్రాన్ని విడుదల చేస్తాం. ఈ పథకాన్ని రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి ప్రారంభించారు. దీని ద్వారా 1 కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తారు. ఇప్పటికే 1.28 కోట్ల రిజిస్ట్రేషన్‌లు నమోదయ్యాయి. 14 లక్షల దరఖాస్తులు అందాయి.

➣ మౌలిక సదుపాయాలకు రూ.11.11 లక్షల కోట్లు.
➣ ఇది జీడీపీలో 3.4 శాతానికి సమానం.
➣ పోల‌వ‌రం పూర్తికి స్ప‌ష్ట‌త ఇవ్వ‌ని కేంద్రం.
➣ ఒడిశా, బీహార్‌లో ఆల‌యాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు. 
➣ రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్‌లకు రూ.26,000 కోట్ల ప్రోత్సాహం.

➣ గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు.
➣ ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ (ఐబీసీ) పరిధిలో బ్యాంక్‌ రుణాల రికవరీని మెరుగుపరచడానికి ఇంటిగ్రేటెడ్ టెక్ ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు.
➣ ముద్ర రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు.
➣ ఎంఎస్‌ఎంఈలకు క్రెడిట్‌ గ్యారెంట్‌ స్కీం.
➣ సులభంగా నిధులు అందేలా చర్యలు.

➣ గంగానదిపై మరో రెండు వంతెనల ఏర్పాటు.
➣ ఈశాన్యరాష్ట్రాల్లో ఎక్స్‌ప్రెస్‌ హైవేల నిర్మాణం.
➣ ఈశాన్యరాష్ట్రాల్లో 100 పోస్ట్‌పేమెంట్‌ బ్యాంకుల ఏర్పాటు.
➣ దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రీయల్‌ పార్క్‌ల ఏర్పాటు.

➣ ఏపీ రాజధాని నిర్మాణానికి నిధులు.
➣ బీహార్‌లో ఎక్స్‌ప్రెస్‌ హైవేలు నిర్మాణం.
➣ బీహార్‌, ఏపీలోనూ పూర్వోదయ పథకం అమలు.
➣ వాటర్‌, పవర్‌, రైల్లే, రోడ్లు రంగాల్లో ఏపీకి అండగా ఉంటాం.
➣ పోలవరం ప్రాజెక్ట్‌కు పూర్తి సాయం అందించేలా చర్యలు.

➣ అమరావతి అభివృద్ధికి రూ.15 వేలకోట్లు.
➣ విభజన చట్టం కింద పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు.
➣ విశాఖ-ఒర్వకల్లు,  హైదరాబాద్‌ ఇండస్ట్రీ కారిడార్ల ఏర్పాటు.
➣ ఏటా 10 లక్షల మందికి విద్యారుణం.
➣ విద్యా, నైపుణ్యాభివృద్ధికి రూ.1.48 లక్షల కోట్లు.

➣ వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు.
➣ మహిళల నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు.
➣ కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి ఈపీఎఫ్‌ఓ పథకం.
➣ ఈపీఎఫ్‌ఓ ద్వారా నగదు బదిలీ.
➣ వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టళ్ల ఏర్పాటు.

➣ నాలుగు కోట్ల మందికి స్కిల్‌ పాలసీ.
➣ ఈ బడ్జెట్‌లో వికసిత్‌ భారత్‌కు రోడ్‌మ్యాప్‌.
➣ సమ్మిళిత అభివృద్ధికి పెద్దపేట.
➣ యువతకు ఐదు ఉద్యోగ పథకాలు.
➣ నాలుగు కోట్ల యువతకు ఉపాధి కల్పించేలా కృషి.

➣ వ్యవసాయం డిజిటలైజేషన్‌ కోసం ప్రత్యేక కార్యక్రమం.
➣ ఉద్యోగాల కల్పన, నైపుణ్యాల సృష్టి, సంస్థల ఏర్పాటుకు బడ్జెట్‌లో నిర్ణయాలు.
➣ కూరగాయల ఉత్పత్తి, సరఫరాలకు ప్రత్యేక చర్యలు.
➣ ప్రధానమంత్రి అన్నయోజన పథకాన్ని ఐదేళ్లు పొడిగించాం.
➣ ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి చరిత్రాత్మక విజయం సాధించారు.
➣ ప్రజల ఆంకాక్షలు నెరవేర్చడంలో ఈ విజయం సాధ్యమైంది.
➣ దేశవ్యాప్తంగా మద్దతు ధరలు పెంచాం.

Union Budget 2024-25 Live Updates and Highlights in Telugu

➤ బడ్జెట్ 2024-25 పత్రాలను ‘యూనియన్ బడ్జెట్’ మొబైల్ యాప్ ఉపయోగించి పొందవచ్చు. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫామ్‌ల్లో లేదా యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పత్రాలు ఇంగ్లీష్, హిందీలో అందుబాటులో ఉంటాయి.
➤ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తేదీ నుంచి దాన్ని అమలు చేయాలంటే 1-2 నెలల సమయం పడుతుంది. గతంలో మార్చి చివరి నాటికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. దాంతో అది జూన్‌ వరకు అమలు అయ్యేది. కానీ ప్రస్తుతం ఫిబ్రవరిలో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. దాంతో ఏప్రిల్‌-మే వరకు అమలు అవుతుంది.

➤ ఫిబ్రవరి 1వ తేదీ 2020లో జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో  రెండు గంటల నలభై నిమిషాలపాటు ప్రసంగించి సీతారామన్ రికార్డు నెలకొల్పారు.

➤ మోడీ 3.0 మొదటి బడ్జెట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలిలో ఆమోదం లభించింది.

➤ సీతారామన్ ఈరోజు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పించనున్నారు. ఆమె వరుసగా ఏడో బడ్జెట్‌ను విడుదల చేస్తూ రికార్డు సృష్టించనున్నారు.
➤ ఎనిమిది నెలల కాలానికి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
➤ వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా బడ్జెట్‌ ఉంటుదన్న ప్రధాని మోదీ

➤ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటుకు చేరుకున్నారు. పార్లమెంటు భవనంలోని ప్రవేశిస్తూ బడ్జెట్‌ ట్యాబ్‌ను ఆమె ప్రదర్శించారు. కొత్తగా ఏర్పడిన మోదీ ప్రభుత్వంలో తొలి బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు.
ఈరోజు బడ్జెట్‌ సమావేశాల్లో జమ్ము కశ్వీర్‌ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెడుతారు.

రాష్ట్రపతితో సమావేశమైన ఆర్థిక మంత్రి..
➤ పార్లమెంటులో జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో రాష్ట్రపతి భవన్‌లో సమావేశమయ్యారు. తిరిగి పార్లమెంట్‌కు వెళ్లారు.
➤ జమ్మూకశ్మీర్‌ బడ్జెట్ కాపీలు పార్లమెంటుకు చేరుకున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ జమ్మూకశ్మీర్ బడ్జెట్‌ 2024-25 అంచనా రశీదులను సమర్పిస్తారు.

➤ నిర్మలా సీతారామన్ తన ‘బహి-ఖాతా’తో రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. గతంలో మాదిరిగానే ఆర్థిక మంత్రి సంప్రదాయ ‘బహి-ఖాతా’ రూపంలో ఉన్న టాబ్‌తోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
➤ నిర్మలమ్మ ఈసారి మెజెంటా పట్టు బోర్డర్ ఉన్న తెల్లటి చీరను ధరించారు.

➤ కొవిడ్‌ పరిణామాల తర్వాత స్టాక్ మార్కెట్‌లోని డెరివేటివ్స్ ట్రేడింగ్ భారీగా పెరిగింది. ప్రభుత్వం, రెగ్యులేటర్‌లు దీన్ని ప్రమాదకరంగా భావిస్తున్నాయి. ఈసారి బడ్జెట్‌లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం.

➤ బడ్జెట్ 2024-25 ప్రకటన సందర్భంగా ఈ రోజు స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి.
➤ దేశంలో అతిపెద్ద సిగరెట్ తయారీదారు ఐటీసీ కంపెనీపై 5–7 శాతం కంటే తక్కువ పన్ను విధించే అవకాశం ఉందని ‘జెఫ్రీస్’ అభిప్రాయపడుతుంది.
➤ ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం రూ.1.08 లక్షల కోట్ల సబ్సిడీలను ప్రభుత్వం పంపిణీ చేసింది. వీటిని మరింత పెంచే అవకాశం ఉంది.

వ్యవసాయం రంగం వృద్ధికి నిర్ణయాలు..?
➤ ఆర్థికసర్వేలోని వివరాల ప్రకారం దేశాభివృద్ధికి తోడ్పడే వ్యవసాయం మరింత పుంజుకోవాలంటే వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచాలని నిపుణులు చెబుతున్నారు. ఈమేరకు బడ్జెట్‌లో నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నారు.
➤ వ్యవసాయ పద్ధతుల్లో ఆధునిక నైపుణ్యాలను తీసుకురావాలని కోరుతున్నారు.
➤ వ్యవసాయ మార్కెటింగ్ మార్గాలను మెరుగుపరచాలంటున్నారు.
➤ పంట ఉత్పత్తుల ధరను స్థిరీకరించాలని చెబుతున్నారు.
➤ వ్యవసాయంలో ఆవిష్కరణలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
➤ ఎరువులు, నీటి వాడకంలో మార్పులు రావాలంటున్నారు.
➤ వ్యవసాయ-పరిశ్రమ సంబంధాలను మెరుగుపరిచేలా నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు.

Published date : 23 Jul 2024 12:44PM

Photo Stories