Skip to main content

Union Budget 2024 Highlights: 2024 బడ్జెట్‌లో కీలకమైన అంశాలు ఇవే..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.
Union Budget 2024 Highlights   Highlights of the Interim Budget address    Important updates from the Interim Budget announcement    Finance Minister Nirmala Sitharaman presenting the Interim Budget 2024-25

ఇందులో పేదలు, మహిళలు, యువత, రైతుల పరిస్థితులను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడించారు.
 
బడ్జెట్ 2024లో కీలకమైన అంశాలు ఇవే..

➤ ప్రభుత్వం మరింత సమగ్రమైన GDP (పాలన, అభివృద్ధి, పనితీరు)పై దృష్టి పెట్టింది.
➤ ప్రభుత్వం 10 ఏళ్లలో 250 మిలియన్ల మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చింది.
➤ పంటల బీమా పథకం ప్రయోజనాలు 40 మిలియన్ల మంది రైతులకు చేరుతాయి.
➤ ద్రవ్యోల్బణం తగ్గింది, ఆర్థిక వృద్ధి పుంజుకుంది.
➤ పన్ను సంస్కరణలు పన్ను స్థావరాన్ని విస్తృతం చేశాయని, పన్ను వసూళ్లను పెంచాయని అన్నారు.
➤ వచ్చే ఐదేళ్లలో భారత్‌లో అపూర్వమైన ఆర్థిక వృద్ధి ఉంటుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.
➤ 2047 నాటికి దేశాన్ని 'విక్షిత్' (అభివృద్ధి) చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆమె చెప్పారు.

➤ రక్షణ ప్రయోజనాల కోసం డీప్ టెక్‌ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించనుంది.
➤ అర్హులైన మధ్యతరగతి వర్గాలకు సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం సహాయం చేస్తుందని వెల్లడించారు.
➤ స్వయం సహాయక సంఘాల విజయం వల్ల 1 కోటి మంది మహిళలు "లఖపతి దీదీలుగా" మారేందుకు సాధికారత కల్పించారని పేర్కొన్నారు.
➤ ప్రత్యక్ష, పరోక్ష పన్నులలో ఎలాంటి మార్పులు లేవు
➤ స్టార్టప్‌లకు పన్ను ప్రయోజనాలు, సార్వభౌమ సంపద ద్వారా చేసే పెట్టుబడులు, పెన్షన్ ఫండ్‌లు మార్చి 2025 వరకు పొడిగించబడతాయి.
➤ దేశంలో పర్యాటక రంగంలో ప్రభుత్వం గణనీయమైన పెట్టుబడులు పెడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన మధ్యంతర బడ్జెట్ 2024 ప్రసంగంలో తెలిపారు.

Union Budget Highlights 2024-24 : కేంద్ర ఆర్థికమంత్రులుగా ఉండి.. బడ్జెట్‌ ప్రవేశపెట్టని వారు వీరే.. కార‌ణం తెలిస్తే.. మీరే..

Published date : 01 Feb 2024 01:38PM

Photo Stories