Skip to main content

Union Budget Highlights 2024-25 : కేంద్ర ఆర్థికమంత్రులుగా ఉండి.. బడ్జెట్‌ ప్రవేశపెట్టని వారు వీరే.. కార‌ణం తెలిస్తే.. మీరే..

దేశంలోని ప్ర‌జ‌లు అత్యంత ఆస‌క్తిగా ఎదురుచూసేది.. కేంద్ర బడ్జెట్‌. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరంలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ 2024-25ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టతున్నారు.
union finance ministers

ఆమె వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండడం విశేషం. అయితే ఇప్పటి వరకు దేశ చరిత్రలో కేంద్ర ఆర్థికమంత్రులుగా ఉండి.. కేంద్ర బడ్జెట్‌ను ప్ర‌వేశ పెట్ట‌లేక పోయారు. ఈ ఆర్థిక మమ‌త్రులు.

☛ Union Budget 2024-25 Live Updates : కేంద్ర బడ్జెట్ 2024 కేటాయింపులు ఇలా.. ఈ సారి వీటికి అధిక ప్రాధాన్యత.. ఇంకా..

దేశ చ‌రిత్రలో రికార్డు స్థాయిలో ఏకంగా పదిసార్లు బడ్జెట్‌ను..
‘బడ్జెట్‌’ పేరు వినగానే గుర్తుకువచ్చే ఆర్థిక మంత్రుల్లో మొరార్జీ దేశాయ్‌ పేరు తప్పకుండా ఉంటుంది. రికార్డు స్థాయిలో ఏకంగా పదిసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రత్యేకత ఆయన సొంతం. కొన్నేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ రికార్డ్‌ కొనసాగుతోంది. 

ఈ ఇద్దరే..
మరోవైపు ఆర్థిక మంత్రిగా పని చేసి ఒక్కసారి కూడా బడ్జెట్‌ను సమర్పించని సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆర్థికమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ బడ్జెట్‌ ప్రవేశపెట్టని జాబితాలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు హెచ్ఎన్ బహుగుణ కాగా మరొకరు కేసీ నియోగి. వీరిద్దరూ ఆర్థిక మంత్రులుగా పనిచేసినప్పటికీ కేంద్ర బడ్జెట్‌ను సమర్పించలేదు. హెచ్ఎన్ బహుగుణ, కేసీ నియోగి చాలా తక్కువ కాలంపాటు పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. 

కార‌ణం ఇదే..?

వీరు మంత్రులుగా పని చేసిన సమయంలో వారికి బడ్జెట్‌ సమర్పించే అవకాశం రాలేదు. నియోగి 1950లో స్వతంత్ర భారతదేశానికి రెండో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించి కేవలం 35 రోజులు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. ఇక బహుగుణ, 1979-80 మధ్య ఐదున్నర నెలల పాటు పదవిలో ఉన్నారు. ఆయనకూ బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం రాలేదు. దీంతో వీరిద్దరూ ఆర్థిక మంత్రిగా పని చేసి కూడా కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేకపోయారు.

☛ గ‌తంలోని కేంద్ర, రాష్ట్ర‌ బడ్జెట్ల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

Published date : 01 Feb 2024 01:17PM

Photo Stories