Skip to main content

Banking Laws Bill: బ్యాంకింగ్‌ సవరణ బిల్లు.. ఒక అకౌంట్‌కు నలుగురు నామినీలు..!

భార‌త ప్రభుత్వం బ్యాంకింగ్‌ చట్టాల (సవరణ) బిల్లు 2024ను ప్రవేశపెట్టింది.
Government introduces Banking Laws Amendment Bill in Lok Sabha

ఒక బ్యాంకు ఖాతాకు నామినీల ఎంపికను ప్రస్తుతమున్న ఒకటి నుంచి నలుగురికి పెంచడంసహా పలు కీలక అంశాలకు సంబంధించిన ఈ బిల్లును లోక్‌సభలో ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌదరి ప్రవేశపెట్టారు.

ఈ బిల్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1955 వంటి వాటిని సవరించడానికి ఉద్దేశించింది.

ఈ బిల్లు ప్రధాన లక్ష్యం ఇదే.. 
డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణ, సేవల విస్తృతి బిల్లు ప్రధాన లక్ష్యం. అన్‌క్టైమ్డ్‌ డివిడెండ్లను ఇన్వెస్టర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఫండ్‌కు బదలాయించడం, బ్యాంకింగ్‌ పరిపాలనా, ఆడిట్‌ వ్యవహారాల్లో మరింత మెరుగుదలకూడా ఈ బిల్లు దోహదపడనుంది. డైరెక్టర్‌షిప్‌లకు సంబంధించిన వడ్డీ పరిమితిని పునర్విర్వచించటానికి సంబంధించిన అంశం బిల్లులో మరో కీలకాంశం.

దాదాపు ఆరు దశాబ్దాల క్రితం నిర్ణయించిన ప్రస్తుత పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.2 కోట్లకు పెంచడం దీని ఉద్దేశం. 2024–25 వార్షిక బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించిన ఈ బిల్లును ఇటీవ‌ల‌ క్యాబినెట్‌ ఆమోదించింది. 

Union Budget: ఆర్థిక బడ్జెట్‌కు ఆమోదముద్ర వేసిన లోక్‌సభ

Published date : 10 Aug 2024 04:30PM

Photo Stories