Aligarh Muslim Unversity: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనార్టీ హోదాపై.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనార్టీ హోదాపై సీజేఐ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 4:3 మెజారిటీతో తీర్పు చెప్పింది.
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ అయినంత మాత్రాన మైనార్టీ హోదా ఉండదనే సుప్రీంకోర్టు 1967లో ఇచ్చిన తీర్పును ధర్మాసనంలో సీజేఐ డీవై చంద్రచూడ్ సహా జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాలు తోసిపుచ్చారు. ఇక ఈ తీర్పుతో ధర్మాసనంలోని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎస్‌సీ శర్మ విభేదించారు.
అయితే అలీగఢ్ యూనివర్సిటీకి మైనార్టీ హోదా ఉంటుందా ఉండదా అనే అంశాన్ని తేల్చేపనని ధర్మాసనం ముగ్గురు జడ్జిల ప్రత్యేక బెంచ్‌కు అప్పగించింది. కాగా, ఈ ఏడాది జనవరి చివరిలో ఈ కేసులో ఎనిమిది రోజుల పాటు వాదనలు విన్న అనంతరం ఫిబ్రవరి 1వ తేదీ సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు చేసింది.