Skip to main content

Supreme Court: వయసు నిర్ధారణకు ఆధార్‌ కార్డు చెల్లదన్న సుప్రీంకోర్టు

వయసు నిర్ధారణకు ఆధార కార్డు ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Aadhaar Card Not Suitable As Proof Of Date Of Birth : Supreme Court Of India

పంజాబ్, హరియాణా హైకోర్టు గతంలో రోడ్డు ప్రమాదంలో మృతుడి వయసును ఆధార్ కార్డు ఆధారంగా నిర్ధారించడంతో పాటు, పరిహారం కూడా తగ్గించిన తీర్పును కొట్టివేసింది.

సుప్రీంకోర్టు.. జువెనైల్ జస్టిస్ యాక్ట్–2015 ప్రకారం పాఠశాల టీసీలో పేర్కొన్న పుట్టిన తేదీని చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలని పేర్కొంది. ‘ఆధార్‌ గుర్తింపు కార్డుగా పనికొస్తుందే తప్ప పుట్టినతేదీని నిర్ధారించడానికి కాదని దాన్ని జారీచేసే యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా 2023లో సర్క్యులర్‌ ద్వారా స్పష్టం చేసింది’ అని జస్టిస్‌ సంజయ్‌ కరోల్, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ల ధర్మాసనం పేర్కొంది.

2015లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి మోటర్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్స్‌ ట్రిబ్యునల్‌ రూ.19.35 లక్షల పరిహారాన్ని ప్రకటించింది.

మృతుడి వయసును టీసీ ఆధారంగా లెక్కించి (45 ఏళ్లు) పరిహారాన్ని గణించింది. పంజాబ్‌– హరియాణా హైకోర్టు ఆధార్‌ కార్డు ఆధారంగా వయసును గణించి (47 ఏళ్లుగా) పరిహారాన్ని రూ.9.22 లక్షలకు తగ్గించింది. 

Justice Sanjiv Khanna: సుప్రీంకోర్టు నూతన సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా
Published date : 25 Oct 2024 06:16PM

Photo Stories