Skip to main content

PM Vidyalaxmi Scheme: మధ్యతరగతి విద్యార్థులకు ‘పీఎం-విద్యాలక్ష్మి’ పథకం

ప్రతిభావంతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఉద్దేశించిన పీఎం- విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర మంతివర్గం ఆమోదం తెలిపింది.
Cabinet Approves PM Vidyalaxmi Scheme for Higher Education

ప్రతిభా వంతులైన విద్యార్థులు పైచదువులకు వెళ్లేందుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతోనే ఈ పథకం తెచ్చామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. దీనికోసం 2024-25 నుంచి 2030-31 మధ్య రూ.3,600 కోట్లు కేటాయించడానికి కేంద్రం సమ్మతించిందన్నారు.  

నాణ్యతగల ఉన్నత విద్యాసంస్థల్లో (క్యూహెచ్ఐఐలు) ప్రవేశం పొందిన వారెవరైనా ఈ పథకానికి అర్హులు. వీరికి కోర్సుకు సంబంధించిన పూర్తి ట్యూషన్ ఫీజు, ఇతర ఖర్చులకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఎటువంటి హామీతో పనిలేకుండా రుణాలిస్తాయి. 

కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని ‘జాతీయ సంస్థాగత ర్యాంకింగ్‌ వ్యవస్థ’ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వ‌ర్క్‌- ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) తాజాగా గుర్తించిన టాప్-100 ర్యాంకుల్లో ఉన్న విద్యాసంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. విద్యాలక్ష్మి పథకం ద్వారా 22 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ విద్యాసంస్థల్లో ప్రవేశం పొందొచ్చు. పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.7.5 లక్షల వరకు రుణం లభిస్తుంది. విద్యా రుణాలు పొందడానికి పీఎం-విద్యాలక్ష్మి అనే ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేయ‌న్నారు.

Mudra Yojana: ముద్రా యోజన రుణ పరిమితి పెంపు.. ఎంతంటే..

Published date : 07 Nov 2024 06:19PM

Photo Stories