Karimganj District: కరీంగంజ్ జిల్లా పేరు మార్చిన ప్రభుత్వం
Sakshi Education
అస్సాం రాష్ట్ర ప్రభుత్వం కరీంగంజ్ జిల్లా పేరును శ్రీ భూమిగా మార్చింది.
ఈ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఎక్స్ (Twitter) వేదిక ద్వారా ప్రకటించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వందేళ్ల క్రితం కరీంగంజ్ ప్రాంతాన్ని శ్రీ భూమి (మా లక్ష్మీ)గా అభివర్ణించారని చెప్పారు. ఈ గౌరవార్థం, రాష్ట్ర కేబినెట్ నిర్ణయం ప్రకారం, ఈ ప్రాంతానికి అధికారికంగా శ్రీ భూమి పేరు నిర్ణయించబడిందని ముఖ్యమంత్రి తెలిపారు.
అజ్‌మేర్ హోటల్ పేరు మార్పు
రాజస్థాన్ ప్రభుత్వం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అజ్‌మేర్ లోని ఓ పర్యాటక హోటల్ పేరును ‘ఖాదీమ్’ నుంచి ‘అజేయమేరు’గా మార్చాలని నిర్ణయించారు. రాజస్థాన్ పర్యాటక సంస్థ ఈ మార్పును అధికారికంగా ప్రకటించింది.
Sakhi Depot: దేశంలోనే తొలి మహిళా బస్ డిపో ప్రారంభం.. ఎక్కడంటే..
Published date : 20 Nov 2024 06:00PM