Arjun Erigaisi: ప్రపంచ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంకర్‌గా అర్జున్.. టాప్ క్రీడాకారులు వీరే..
ఈ ఘనత సాధించిన అర్జున్, విశ్వనాథన్ ఆనంద్ తరువాత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండవ స్థానాన్ని పొందిన భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందారు.
టాప్ క్రీడాకారులు వీరే..
- ప్రథమ ర్యాంక్: నార్వే గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్సెన్
- రెండో ర్యాంక్: అర్జున్ ఎరిగైసి (తెలంగాణ, భారత్)
- మూడో ర్యాంక్: ఇటాలియన్-అమెరికన్ గ్రాండ్ మాస్టర్ ఫాబియానో కరువానా
- నాల్గో ర్యాంక్: నకమురా హికారు (అమెరికా)
- ఐదో ర్యాంక్: గుకేశ్ (భారత్)
- ఆరో ర్యాంక్: అబ్దుసట్టోరోవ్ నోడిర్బెక్ (ఉజ్బెకిస్థాన్)
సెర్బియా గ్రాండ్‌మాస్టర్ అలెక్సీ సరానాతో నవంబర్ 7వ తేదీ చెన్నైలో జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన అర్జున్ 37 ఎత్తుల్లో గెలిచాడు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. మూడో రౌండ్ తర్వాత అర్జున్, అమీన్ తబాతబాయి (ఇరాన్) 2.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
ICC Test Rankings: దశాబ్దకాలం తర్వాత విరాట్ కోహ్లి చేదు అనుభవం.. టాప్-20 నుంచి ఔట్
అర్జున్ ప్రపంచ ర్యాంకింగ్స్
➣ఫిడే లైవ్ ర్యాంకింగ్స్ ప్రకారం, అర్జున్ ప్రస్తుతం 2805.8 ఎలో రేటింగ్తో ప్రపంచ రెండో ర్యాంకర్ గా ఉన్నారు.
➣ ఫాబియానో కరువానా (2805 పాయింట్లతో) మూడో స్థానానికి పడిపోయారు.
➣ అర్జున్, 2011లో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానాన్ని పొందిన రెండో భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందారు.
పూర్తి ర్యాంకింగ్ వివరాలు
లైవ్ రేటింగ్స్: ఈ రేటింగ్స్ ప్రతి టోర్నీలో రౌండ్ పర్ణం తర్వాత మారుతుంటాయి. ఫిడే ప్రకారం ప్రతి నెలా ఒకటో తేదీన అధికారిక ర్యాంకింగ్స్ విడుదలవుతాయి.
2800 పాయింట్లు: అర్జున్ గతంలో 2800 పాయింట్లు సాధించి, 16వ ప్లేయర్గా గుర్తింపుతీసుకున్నాడు.