Skip to main content

Olympics 2036: భారత్‍లో 2036 ఒలింపిక్స్!

భారత్‌ 2036 ఒలింపిక్స్‌ను నిర్వహించే దిశగా అడుగులు వేస్తోంది.
Indian Olympic Association Submits Letter Of Intent To Host 2036 Olympics

2036 ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ నిర్వహణకు తాము సిద్దంగా ఉన్నామని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ)కి లేఖ (Letter Of Intent) రాసింది. అక్టోబర్ 1వ తేదీ ఐఓసీ ఫ్యూచర్‌ హోస్ట్‌ కమీషన్‌కు భారత ఒలింపిక్స్‌ సంఘం లేఖ రాసినట్లు పీటీఐ పేర్కొంది. గతేడాది భారత ప్రధాని నరేంద్ర మోదీ 141వ ఐఓసీ సెషన్‌లో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఒలింపిక్స్‌ నిర్వహణకు తాము సిద్దంగా ఉన్నామని ప్రధాని మోదీ ప్రకటించారు.

2036 ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కులు ఏ దేశానికి దక్కుతాయన్న విషయం వచ్చే ఏడాది తెలుస్తుంది. ఒలింపిక్స్‌ నిర్వహణ విషయంలో భారత్‌కు సౌదీ అరేబియా, ఖతార్‌, టర్కీ, సౌత్‌ కొరియా గట్టి పోటీ ఇస్తున్నాయి. మరోవైపు మెక్సీకో, ఇండోనేషియా, పోలాండ్‌, ఈజిప్ట్‌ కూడా ఒలింపిక్స్‌ నిర్వహణ రేసులో ఉన్నట్లు తెలుస్తుంది.

World Wrestling Championship: ప్రపంచ అండర్-23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భార‌త్‌కు తొమ్మిది పతకాలు

కాగా.. ఈ ఏడాదే (2024) పారిస్‌లో విశ్వ క్రీడ‌లు ముగియ‌నున్నాయి. 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజెల్స్‌లో, ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ వేదిక‌గా 2032 విశ్వ క్రీడలు జరుగనున్నాయి. 2036 ఒలింపిక్స్‌ వేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 2036 ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారత దేశ ప్రజలంతా ఉత్సాహంగా ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు. ఒలింపిక్స్ నిర్వహణ 140 కోట్ల భారతీయుల కల.

Dhyan Chand Award: ‘ధ్యాన్‌చంద్‌’ అవార్డు పేరు మార్పు.. ఇకపై ఈ అవార్డు పేరు ఏమిటంటే..

Published date : 06 Nov 2024 06:20PM

Photo Stories