U23 World Wrestling Championships 2024: ప్రపంచ అండర్-23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొమ్మిది పతకాలు
Sakshi Education
ప్రపంచ అండర్-23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీలలో భారత రెజ్లర్లు మొత్తం తొమ్మిది పతకాలతో టోర్నీని ముగించారు.
పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో.. చిరాగ్ చికారా 57 కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. విక్కీ (97 కేజీలు), సుజీత్ కల్కాల్ (70 కేజీలు) కాంస్య పతకాలను కూడా దక్కించుకున్నారు.
ఈ పోటీలలో.. భారతీయ రెజ్లర్లు మొత్తం ఒక స్వర్ణం, మూడు కాంస్యాలను అందుకొని, తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. గత సంవత్సరంలో భారత్‌కు కేవలం రెండు కాంస్య పతకాలు లభించాయి.
మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో.. అంజలి (59 కేజీలు) రజత పతకాన్ని నెగ్గగా, నేహా శర్మ (57 కేజీలు), శిక్ష (65 కేజీలు), మోనిక (68 కేజీలు) కాంస్య పతకాలను సాధించారు.
పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో.. విశ్వజిత్ మోరే (55 కేజీలు) భారతదేశానికి ఏకైక కాంస్య పతకాన్ని అందించాడు.
Dhyan Chand Award: ‘ధ్యాన్‌చంద్’ అవార్డు పేరు మార్పు.. ఇకపై ఈ అవార్డు పేరు ఏమిటంటే..
Published date : 29 Oct 2024 05:36PM