WPL 2025: మహిళల ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా విడుదల
డబ్ల్యూపీఎల్ వేలం డిసెంబర్ నెల మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. ప్లేయర్లను తీసుకోవడం కోసం లీగ్ టీమ్‌లకు గత సీజన్‌లో గరిష్టంగా రూ.13 కోట్ల 50 లక్షల పరిధి విధించగా.. ఇప్పుడు మరో కోటిన్నర పెంచి దానిని రూ.15 కోట్లు చేశారు.
ఒక్కో టీమ్‌లో 18 మంది చొప్పున మొత్తం 90 మందికి డబ్ల్యూపీఎల్‌లో అవకాశం ఉంది. ఇప్పుడు మొత్తం 71 మందిని టీమ్‌లు రీటెయిన్ చేసుకున్నాయి. దాంతో 19 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. టీమ్‌లు వదిలేసుకున్న ఆటగాళ్లలో పూనమ్ యాదవ్, స్నేహ్ రాణా, తహుహు, క్యాథరీన్ బ్రైస్, వేద కృష్ణమూర్తి, హీతర్ నైట్, ఇసీ వాంగ్, హైదరాబాద్ ప్లేయర్ చొప్పదండి యషశ్రీ ఉన్నారు.
రీటెయిన్ చేసుకున్న భారత ప్లేయర్ల వివరాలు ఇవే..
ఢిల్లీ క్యాపిటల్స్: జెమీమా, షఫాలీ, రాధ యాదవ్, అరుంధతి రెడ్డి (హైదరాబాద్), శిఖా పాండే, తానియా భాటియా, మిన్ను మణి, స్నేహ దీప్తి (ఆంధ్రప్రదేశ్), టిటాస్ సాధు.
ICC Test Rankings: దశాబ్దకాలం తర్వాత విరాట్ కోహ్లి చేదు అనుభవం.. టాప్-20 నుంచి ఔట్
గుజరాత్ జెయింట్స్: హేమలత, తనూజ, షబ్నమ్ షకీల్ (ఆంధ్రప్రదేశ్), ప్రియా మిశ్రా, త్రిష పూజిత, మన్నత్, మేఘనా సింగ్.
ముంబై ఇండియన్స్: హర్మన్‌ప్రీత్, అమన్‌దీప్, అమన్‌జోత్, జింతిమణి, కీర్తన, పూజ వస్త్రకర్, సజన, సైకా ఇషాఖ్, యస్తిక భాటియా.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన, రిచా ఘోష్, సబ్బినేని మేఘన (ఆంధ్రప్రదేశ్), శ్రేయాంక పాటిల్, ఆశ శోభన, రేణుకా సింగ్, ఏక్తా బిస్త్, కనిక.
యూపీ వారియర్స్: కిరణ్ నవ్‌గిరే, శ్వేత సెహ్రావత్, దీప్తి శర్మ, సైమా ఠాకూర్, అంజలి శర్వాణి (ఆంధ్రప్రదేశ్), గౌహర్ సుల్తానా (హైదరాబాద్), ఉమా ఛెత్రి, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ ఖెమ్నార్, వృంద దినేశ్.
T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్ విజేత న్యూజిలాండ్.. ఇదే తొలిసారి.. ప్రైజ్‌మనీ ఎంతంటే..
Tags
- WPL 2025 Retention
- List Of Retained Players
- Womens Premier League
- Mumbai Indians
- Royal Challengers Bengaluru
- Delhi Capitals
- UP Warriorz
- Gujarat Giants
- Arundhati Reddy
- Sneha Deepthi
- Shabnam Shakil
- Sabbineni Meghana
- Anjali Sarvani
- latest sports news
- Sakshi Education Updates
- WPL2025
- KeyPlayers2025
- WomensCricket2025
- WPLTopPlayers