Women's T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్ విజేత న్యూజిలాండ్.. ప్రైజ్‌మనీ ఎంతంటే..
అక్టోబర్ 20వ తేదీ అమీతుమీలో కివీస్ జట్టు 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై నెగ్గింది. మూడో ప్రయత్నంలో టీ20 ప్రపంచకప్‌ను దక్కించుకుంది.
కివీస్ టీ20 ప్రపంచకప్‌ను సాధించడం ఇదే తొలిసారి. 2009, 2010లలో న్యూజిలాండ్ ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.
విజేత న్యూజిలాండ్ జట్టుకు 23 లక్షల 40 వేల (రూ.19 కోట్ల 67 లక్షలు) డాలర్లు, రన్నరప్ దక్షిణాఫ్రికా జట్టుకు 11 లక్షల 70 వేల డాలర్లు (రూ.9 కోట్ల 83 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
Hockey India League: మహిళల హాకీ ఇండియా లీగ్ వేలం.. అగ్రస్థానంలో నిలిచిన ప్లేయర్ ఈమెనే..
బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాటర్ అమెలియా కెర్ (43; 4 ఫోర్లు), ఓపెనర్ సుజీ బేట్స్ (32; 3 ఫోర్లు), మిడిలార్డర్‌లో బ్రూక్ హ్యాలిడే (28 బంతుల్లో 38; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. ప్రత్యర్థి బౌలర్లలో ఎమ్‌లాబా 2 వికెట్లు తీయగా, అయబొంగ, ట్రియాన్, డి క్లెర్క్ తలా ఒక వికెట్ తీశారు.
అనంతరం దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులే చేసి ఓడిపోయింది. ఓపెనర్లు కెప్టెన్ లౌరా వోల్‌వార్ట్ (33; 5 ఫోర్లు), తజ్మిన్ బ్రిట్స్ (17; 1 ఫోర్) 6.5 ఓవర్లలో 51 పరుగులు చేసి శుభారంభమిచ్చారు. ఇక మిగిలిన 13.1 ఓవర్లలో 108 పరుగులు చేస్తే కప్ గెలిచేసేది.
కానీ అదే స్కోరుపై బ్రిట్స్, కాసేపటికి లౌరా అవుట్ కావడంతోనే అంతా మారిపోయింది. తర్వాత వచ్చిన అనెకె (9), మరిజాన్ (8), డి క్లెర్క్ (6), ట్రియాన్ (14), సునె లుస్ (8), డెర్క్‌సెన్ (10) కివీ బౌలర్ల ధాటికి బెంబేలెత్తారు.
Kho Kho World Cup: భారత్‌లోనే.. తొలి ఖో ఖో వరల్డ్ కప్
రోజ్‌మేరీ, అమెలియా కెర్ చెరో 3 వికెట్లు తీశారు. కెర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్’ అవార్డులు దక్కాయి.