Skip to main content

ITF Open: ఐటీఎఫ్ డబ్ల్యూ15 టోర్నమెంట్ విజేత తనీషా కశ్యప్

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) డబ్ల్యూ15 టోర్నమెంట్‌లో భారత్‌కు చెందిన తనీషా కశ్యప్‌ విజేతగా నిలిచిది.
Akanksha Nitture to take on Tanisha Kashyap in final of the ITF Open  Tanisha Kashyap celebrating her victory at the ITF W15 tournament

అక్టోబ‌ర్ 20వ తేదీ ముగిసిన ఈ టోర్నీలో అస్సాంకు చెందిన 22 ఏళ్ల తనీషా మూడు సెట్‌ల పోరాటంలో విజయాన్ని అందుకుంది. భారత్‌కే చెందిన ఆకాంక్ష నిట్టూరేతో జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో తనీషా 6–7 (5/7), 6–1, 6–1తో గెలుపొందింది. 

తద్వారా తన కెరీర్‌లో తొలి ఐటీఎఫ్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన ఈ తుది పోరులో తనీషా 10 డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది.

చాంపియన్‌ తనీషాకు 2,352 డాలర్లు (రూ.1 లక్షా 97 వేలు), రన్నరప్‌ ఆకాంక్షకు 1,470 డాలర్లు (రూ.1 లక్షా 23 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 

T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్‌ విజేత న్యూజిలాండ్.. ఇదే తొలిసారి.. ప్రైజ్‌మనీ ఎంతంటే..
Published date : 21 Oct 2024 12:20PM

Photo Stories