ICC Rankings: ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో బూమ్రా నంబర్‌వన్
Sakshi Education
ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు.

జనవరి 22వ తేదీ ఐసీసీ ప్రకటించిన తాజా బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా నంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
బౌలింగ్ విభాగంలో..
- జస్‌ప్రీత్ బుమ్రా.. 908 పాయింట్లతో నంబర్‌వన్ స్థానంలో ఉన్నాడు.
- ఆస్ట్రేలియాకు చెందిన ప్యాట్ కమిన్స్.. 841 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
- దక్షిణాఫ్రికాకు చెందిన కగిసో రబాడ 837 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
బ్యాటింగ్‌లో..
- యశస్వి జైశ్వాల్ 4వ స్థానంలో ఉన్నాడు.
- రిషబ్ పంత్ 10వ స్థానంలో ఉన్నాడు.
ఆల్‌రౌండర్ల విభాగంలో..
- రవీంద్ర జడేజా(400 పాయింట్లు) నంబర్‌వన్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు.
- అక్షర్ పటేల్ 12వ స్థానంలో ఉన్నాడు.
Champions Trophy: చాంపియన్స్ ట్రోఫీ టీమ్ మేనేజర్‌గా హెచ్‌సీఏ కార్యదర్శి దేవ్‌రాజ్
Published date : 23 Jan 2025 03:39PM