Skip to main content

High Court: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా న‌లుగురు జడ్జీలు

తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు.
Centre appoints Four Additional Judges to Telangana State High Court

దీనికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం జ‌న‌వ‌రి 22వ తేదీ విడుదల చేసింది. సిటీ సివిల్‌ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రేణుక యార, సిటీ స్మాల్‌ కాజెస్‌ కోర్టు చీఫ్‌ జడ్జి నర్సింగ్‌రావు నందికొండ, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ తిరుమలాదేవి ఈద, హైకోర్టు రిజిస్ట్రార్‌ (అడ్మినిస్ట్రేషన్‌) మధుసూదన్‌రావు బొబ్బిలి రామ­య్య పేర్లను జ‌న‌వ‌రి 11వ తేదీ ఢిల్లీలో భేటీ అయిన సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. 

వీరంతా 2012లో జిల్లా జడ్జిలుగా ఎంపికైనవారు కావడం గమనార్హం. కాగా న్యాయాధికారుల కోటా­లో వీరి ఎంపిక జరిగింది. తిరుమలాదేవి బాధ్య­త­లు చేపట్టిన నాటి నుంచి 2026 జూన్‌ 1 వరకు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది. 

Dhananjay Shukla: ఐసీఎస్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నికైన ధనుంజయ్‌ శుక్లా.. ఉపాధ్యక్షుడిగా..

మిగతా ముగ్గురు రెండేళ్లు అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వహిస్తారని.. ఆ తర్వాత శాశ్వత న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపడతారని స్పష్టం చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్ జ‌న‌వ‌రి 25వ తేదీ కొత్త న్యాయమూర్తులతో ప్రమాణం చేయించనున్నారు. హైకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 42 కాగా, ప్రస్తుతం 26 మంది ఉన్నారు. ఈ నలుగురితో కలిపి జడ్జిల సంఖ్య 30కి చేరింది. ఇంకా 12 ఖాళీలు ఉండగా, వీటి భర్తీ కోసం న్యాయవాదులు ఎదురుచూస్తున్నారు. 

AP High Court: హైకోర్టు న్యాయమూర్తులుగా ఇద్దరు న్యాయాధికారులు

Published date : 24 Jan 2025 08:39AM

Photo Stories