Etikoppaka: రిపబ్లిక్ డే పరేడ్‌లో ఏపీ నుంచి ఏటికొప్పాక బొమ్మల థీమ్
Sakshi Education
76 గణతంత్ర దినోత్సవంలో భాగంగా జనవరి 26వ తేదీ భారతదేశ రాజధాని న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శకటాలు పరుగులు తీయనున్నాయి.

ఈ గణతంత్ర వేడుకల్లో ఏటికొప్పాక థీమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శకటాన్ని ప్రదర్శించనుంది. 'స్వర్ణ భారత్ విరాసత్-వికాస్' పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈ సారి శకటాలను ప్రదర్శించబోతోంది.
కేంద్రంలోని వివిధ శాఖలకు చెందిన 15 శకటాలతో పాటు పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి మొత్తం 31 శకటాలు కర్తవ్యపథ్ సందడి చేయనున్నాయి.
400 ఏళ్ల చరిత్ర ఉన్న ఏటికొప్పాక బొమ్మల శకటం ముందు భాగంలో బొమ్మలు తయారు చేసే కళాకారుడు, గణపతి, వెనుక శ్రీ వేంకటేశ్వర స్వామి బొమ్మలను తీర్చిదిద్దారు. వాహనం మొత్తం గ్రామీణ వాతావరణం ఉట్టి పడేలా ముగ్గులతో డిజైన్ చేశారు. వాహనంపై పలు రకాల బొమ్మలను అలంకరించారు.
Prabowo Subianto: రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు
Published date : 23 Jan 2025 01:48PM