Hockey India League: మహిళల హాకీ ఇండియా లీగ్ వేలం.. అగ్రస్థానంలో నిలిచిన ప్లేయర్ ఈమెనే..
ఇందులో భారత జట్టు డిఫెండర్ ఉదిత దుహాన్ రూ.32 లక్షలకు శ్రాచి రార్ బెంగాల్ టైగర్స్ జట్టుకు అమ్ముడుపోయి, వేలంలో అగ్రస్థానంలో నిలిచింది.
ఉత్తమ 5 ఆటగాళ్లు, వారి జట్లు ఇవే..
ఉదిత దుహాన్ (రూ.32 లక్షలు) - శ్రాచి రార్ బెంగాల్ టైగర్స్
యిబ్బీ జాన్సన్ (రూ.29 లక్షలు) - ఒడిశా వారియర్స్
లాల్‌రెమ్సియామి (రూ.25 లక్షలు) - శ్రాచి రార్ బెంగాల్ టైగర్స్
సునెలితా టొప్పో (రూ.24 లక్షలు) - ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్
సంగీత కుమారి (రూ.22 లక్షలు) - ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్
భారత సీనియర్ జట్టు కెప్టెన్ సలీమా టెటెను ఒడిశా వారియర్స్ రూ.20 లక్షలకు సొంతం చేసుకున్నారు. సూర్మా హాకీ క్లబ్ భారత మాజీ కెప్టెన్ సవితా పూనియా, షర్మిలా దేవి, నిక్కీ ప్రధాన్‌లను తమ జట్టులో చేర్చుకుంది. ఒడిశా వారియర్స్ ఇషిక, నేహా గోయల్‌లను కూడా తమ జట్టులో చేర్చుకుంది. హెచ్‌ఐఎల్ టోర్నీ డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు రాంచీ, రౌర్కెలాలలో జరుగుతుంది.
Tags
- Hockey India League
- women Hockey players
- Delhi SG Pipers
- Odisha Warriors
- Udita Duhan
- Lalremsiami
- Sunelita Toppo
- Sangeeta Kumari
- latest sports news
- HockeyIndiaLeague
- HILWomensTournament
- SrachchiRarBengalTigers
- HockeyAuction2024
- IndianHockey
- TopAuctionBid
- HockeyNews
- WomensHockey
- sakshieducation latest sports news in 2024