Skip to main content

Fenesta Open Champions: జాతీయ టెన్నిస్‌ చాంపియన్‌షిప్ విజేత‌లు వీరే..

ఫెనెస్టా ఓపెన్‌ జాతీయ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో టాప్‌ సీడ్, గుజరాత్‌ క్రీడాకారిణి వైదేహి చౌదరి విజేతగా నిలిచింది.
Vaidehi Choudhary celebrating her victory at the Fenesta Open National Tennis Championship  Rethin Pranav and Vaidehi Chaudhari win National Tennis Championship

మహిళల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగిన వైదేహి 6–3, 6–3తో మాయా రేవతి (తమిళనాడు)పై విజయం సాధించింది. 

గంటన్నర పాటు సాగిన తుది పోరులో తొలి గేమ్‌ కోల్పోయిన వైదేహి ఆ తర్వాత వరుసగా మూడు గేమ్‌లు నెగ్గి ముందంజ వేసింది. అదే జోరులో తొలి సెట్‌ కైవసం చేసుకున్న వైదేహి.. రెండో సెట్‌ కూడా నెగ్గి రెండోసారి జాతీయ చాంపియన్‌గా నిలిచింది. 

పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో అన్‌సీడ్‌ ప్లేయర్‌ రెథిన్‌ ప్రణవ్‌ (తమిళనాడు) 6–4, 2–6, 6–2తో నితిన్‌ కుమార్‌ సిన్హా (రైల్వేస్‌)పై గెలిచి చాంపియన్‌గా అవతరించాడు. క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన 17 ఏళ్ల రెథిన్‌ ప్రణవ్‌ వరుస విజయాలతో సత్తా చాటి విజేతగా నిలిచాడు. 

Kho Kho World Cup: భారత్‌లోనే.. తొలి ఖో ఖో వరల్డ్ కప్

Published date : 07 Oct 2024 01:24PM

Photo Stories