ISSF Junior World Championship: షూటింగ్ చాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన ముకేశ్.. ఆరు పతకాలు..
ఈ ఈవెంట్‌లో ముకేశ్ ఖాతాలో ఆరో పతకం చేరింది. ఇప్పటికే నాలుగు స్వర్ణాలు, ఓ కాంస్యం నెగ్గిన అతను అక్టోబర్ 6వ తేదీ మరో బ్రాంజ్ మెడల్ సాధించాడు. జూనియర్ పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో 548 స్కోరుతో మూడో స్థానంలో నిలిచాడు.
దీపక్(545) 5వ స్థానంలో నిలువగా.. ఉమేశ్ చౌదరి(530), రాజ్ చంద్ర(528) 17, 18 స్థానాల్లో నిలిచారు. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో బంగారు పతకాలు గెలిచిన ముకేశ్.. 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్యం గెలిచాడు.
మరోవైపు, జూనియర్ మహిళల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో పరిషా గుప్తా రజతం సాధించింది. 540 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. తాజాగా రెండు పతకాలు చేరడంతో భారత్ మెడల్స్ సంఖ్య 23కు చేరింది. ఈ టోర్నీలో భారత్ 23 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇందులో 13 స్వర్ణాలు, మూడు రజతాలు, 7 కాంస్యాలు ఉన్నాయి.
Tags
- World Junior Shooting Championship
- Deepak Dalal
- Kamaljeet
- Raj Chandra
- Umesh Chaudhary
- ISSF Junior World Championship 2024
- Indian shooters
- latest sports news
- Sakshi Education Updates
- ShootingSports
- SportsAchievements
- JuniorShooting
- Peru2024
- YouthSports
- andhrapradesh
- IndianShooter
- sports news in telugu
- sakshieducation sports news in telugu