China Open: వరుసగా మూడోసారి.. చైనా ఓపెన్‌లో విజేతగా నిలిచిన స్పెయిన్ స్టార్
ప్రపంచ నంబర్ వన్ యానిక్ సినెర్ (ఇటలీ)పై వరుసగా మూడోసారి గెలుపొందాడు. ఈ విజయంతో అల్కరాజ్ ఈ సీజన్‌లో తన నాలుగో సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.
అక్టోబర్ 2వ తేదీ చైనా ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో ప్రపంచ మూడో ర్యాంకర్ అల్‌కరాజ్ చాంపియన్‌గా నిలిచాడు. 3 గంటల 21 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో అల్‌కరాజ్ 6–7 (6/8), 6–4, 7–6 (7/3)తో డిఫెండింగ్ చాంపియన్ సినెర్‌ను ఓడించాడు. చైనా ఓపెన్‌కంటే ముందు ఈ సీజన్‌లో అల్‌కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ, ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ టైటిల్స్‌ను సాధించాడు.
విజేతగా నిలిచిన అల్‌కరాజ్‌కు 6,95,750 డాలర్ల (రూ.5 కోట్ల 84 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు.. రన్నరప్ సినెర్‌కు 3,74,340 డాలర్ల (రూ.3 కోట్ల 14 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 330 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
FIDE Chess Rating: ఫిడే ర్యాంకింగ్స్‌లో ముందుకొచ్చిన భారతీయ చెస్ ఆటగాళ్లు వీరే..