Skip to main content

Guinness Record: అతి చిన్న వాషింగ్‌​ మెషీన్‌తో ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారతీయుడు..!

భారతీయ ఇంజనీర్‌ సెబిన్‌ సాజీ ఊహకే అందని విధంగా అత్యంత మైక్రో వాషింగ్‌ మెషిన్‌ని రూపొందించి గిన్నిస్‌ రికార్డు నెలకొల్పాడు.
Indian Engineer Sebin Saji Breaks World Record With The Smallest Washing Machine

ఇదే ప్రపంచంలోనే అతి చిన్న వాషింగ్‌ మెషీన్‌. దీని వైశాల్యం, పొడవు, వెడల్పలు వరుసగా 1.28 అంగుళాలు, 1.32 అంగుళాలు, 1.52 అంగుళాలే కావడం విశేషం. ఇది ఇది 1990ల నాటి ప్రసిద్ధ హ్యాండ్‌హెల్డ్ బొమ్మ అయిన డిజిటల్‌ పెంపుడు జంతువు సైజు కంటే కూడా చిన్నది. 
 
అయితే ఇది సాధారణ వాషింగ్‌ మెషీన్‌లానే పనిచేస్తుండటం మరింత విశేషం. ఇది చిన్న లోడ్ల కోసం రూపొందించడం జరిగింది. ఇంజీనీరింగ్‌ నైపుణ్యంతో సూక్ష్మీకరణ అనే హస్తకళకు సాజీ రూపొందించిన ఈ గాడ్జెట్‌ నిలువెత్తు నిదర్శనం. 

వర్కింగ్‌ పరంగా అసెంబుల్‌ చేసి చూస్తే.. అది పూర్తిగా వర్క్‌ అవ్వడమే కాక, వాష్‌, రిన్‌, స్పిన్‌, వంటి వాటిని కొలిచేందుకు డిజిటల్ కాలిపర్‌లను ఉపయోగించారు. 

Nobel Prize in Economics: అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ అవార్డు.. ఎవ‌రెవరికంటే..

సాజీ వాషింగ్‌ మెషీన్‌ ఎలా వర్క్‌చేస్తుందో వివరిస్తున్న వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఆ వాషింగ్‌ మెషీన్‌లో చిన్న క్లాత్‌, చిటికెడు వాషింగ్‌ పౌడర్‌ వేయగానే ఎలా వాష్‌ చేస్తుందో క్లియర్‌గా ఆ వీడియోలో కనిపిస్తోంది. ఇప్పటివరకు తయారైన మైక్రో వాషింగ్‌ మెషీన్‌లలో ఇదే అత్యంత చిన్నదని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది.

Published date : 16 Oct 2024 02:45PM

Photo Stories