ITF Open: ఐటీఎఫ్ టోర్నీలో విజేతగా నిలిచిన హుమేరా–పూజా జోడీ
Sakshi Education
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ15 టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి హుమేరా బహార్మస్ డబుల్స్ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది.
బెంగళూరులో అక్టోబర్ 20వ తేదీ ముగిసిన ఈ టోర్నీలో హుమేరా భారత్‌కే చెందిన పూజా ఇంగాలెతో కలిసి డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది.
హోరాహోరీగా సాగిన ఫైనల్లో టాప్ సీడ్ హుమేరా–పూజా ద్వయం 3–6, 6–0, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో ఆకాంక్ష–సోహా సాదిక్ (భారత్) జోడీపై గెలిచింది. 78 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హుమేరా–పూజా రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశారు.
తమ సర్వీస్‌ను రెండుసార్లు చేజార్చుకొని, ప్రత్యర్థి జోడీ సర్విస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశారు. హుమేరా కెరీర్‌లో ఇది రెండో ఐటీఎఫ్ డబుల్స్ టైటిల్. 2022లో హైదరాబాద్‌కే చెందిన శ్రీవల్లి రష్మికతో కలిసి హుమేరా గుర్‌గ్రామ్‌లో జరిగిన ఐటీఎఫ్ టోర్నీలో తొలిసారి డబుల్స్ టైటిల్‌ను సాధించింది.
Akanksha Nitture: ఐటీఎఫ్ డబ్ల్యూ15 టోర్నమెంట్ విజేత తనీషా
Published date : 21 Oct 2024 12:02PM