ESICON 2024: విశాఖలో ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా సదస్సు
'తొలిరోజు పీజీలకు వర్క్ షాప్ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మధుమేహం, తదితర అంశాల మీద ప్రత్యేక సెషన్ ఉంటుంది. సదస్సుకు అమెరికా, దుబాయ్, ఇంగ్లం డ్ తదితర దేశాల నుంచి ఫ్యాకల్టీ వైద్యులు వస్తారు' సదస్సు కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కె.ఎ.వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. 8వ తేదీ సాయంత్రం జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొననున్నారు.
'1971లో ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఇసికాన్) స్థాపన జరిగిందని, విశాఖలో తొలిసారిగా ఈ సదస్సు జరుగుతోంది. సుగర్, థై రాయిడ్, మెడ వద్ద వాపు, లింగధారణ వ్యాధులు, ఎముకల క్షీణత తదితర అంశాల్లో ఇటీవల వచ్చిన ఆధునిక చికిత్సల గురించి ఈ సదస్సులో చర్చించసున్నారు.' అని సదస్సు చైర్మన్ డాక్టర్ కె.దిలీప్ కుమార్ అన్నారు.
మూడు రోజుల పాటు జరిగే సదస్సులో పలు అంశాల మీద 250 మంది వైద్యులు, 200 మంది ప్రతినిధులు ఆధు నిక వైద్యరీతులపై ప్రసంగించనున్నారు.
TTD Board Chairman: టీటీడీ నూతన చైర్మన్‌గా బీఆర్ నాయుడు.. 24 మందితో ధర్మకర్తల మండలి..