Mandeep Jangra: వరల్డ్ టైటిల్ నెగ్గిన భారత బాక్సర్ మన్‌దీప్ జాంగ్రా
Sakshi Education
భారత ప్రొఫెషనల్ బాక్సర్ మన్‌దీప్ జాంగ్రా అంతర్జాతీయ బాక్సింగ్ వేదికపై అపూర్వ విజయం సాధించాడు.
ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య (డబ్ల్యూబీఎఫ్) సూపర్ ఫెదర్ వెయిట్‌లో మన్‌దీప్ ప్రపంచ చాంపియన్‌గా ఆవిర్భవించాడు. కేమన్ ఐలాండ్స్‌లో జరిగిన ఈ ఈవెంట్ టైటిల్ పోరులో బ్రిటన్ బాక్సర్ కొనొర్ మెకింటోష్‌ను మన్‌దీప్ ఓడించాడు. 31 ఏళ్ల ఈ హరియాణా స్టార్ పంచ్ పవర్ ముందు బ్రిటన్ ప్రత్యర్థి నిలువలేకపోయాడు.
ఆరంభ రౌండ్ నుంచి ప్రత్యర్థిపై ముష్టిఘాతాలు కురిపించిన భారత బాక్సర్ మొత్తం పది రౌండ్ల పాటు మెకింటోష్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగాడు. రౌండ్ రౌండ్‌కు తన పంచ్ పదును పెరిగిపోవడంతో ప్రత్యర్థికి ఎటు పాలుపోలేదు. అమెచ్యూర్ సర్క్యూట్‌లో 12 సార్లు రింగ్‌లోకి దిగితే కేవలం ఒకే ఒక్కసారి ఓడిన మన్‌దీప్ 11 సార్లు ఘనవిజయం సాధించాడు. కాగా 2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో జాంగ్రా రజత పతకం గెలిచాడు.
ICC Test Rankings: దశాబ్దకాలం తర్వాత విరాట్ కోహ్లి చేదు అనుభవం.. టాప్-20 నుంచి ఔట్!
Published date : 07 Nov 2024 06:43PM