Skip to main content

Union Budget: బడ్జెట్ ఎఫెక్ట్.. పెర‌గ‌నున్న, త‌గ్గ‌నున్న ధ‌ర‌లు ఇవే..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.
What is Cheaper and What Gets Costlier After the Budget Announcement?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని  బీజేపీ సర్కార్‌ పేదలు, మహిళలు, యువత, రైతులపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడించారు. 
 
అయితే మహిళలు, బాలికల కోసం ప్రత్యేక పథకాలను, ఉద్యోగుల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రకటించిన ఆర్థిక మంత్రి ప్రస్తుత పన్నుల విధానం, పన్ను మినహాయింపులను కూడా ప్రతిపాదించారు. మొబైల్ ఫోన్ ధరలు, బంగారం, వెండి, రాగి ధరలు తగ్గింపునకు దారితీసే చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. 
 
మొబైల్ ఫోన్లు, మొబైల్ ఛార్జర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి తగ్గించారు. బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి, ప్లాటినంపై 6.4 శాతానికి తగ్గించారు. మూడు కేన్సర్ చికిత్స మందులు ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు నిచ్చారు. దీంతో కేన్సర్‌ బాధితులకు భారీ ఊరట లభించనుంది. 

బంగారం, వెండిపై సుంకాలు 6 శాతం తగ్గింపు రిటైల్ డిమాండ్‌ను గణనీయంగా పెంచు తుందన్నారు. ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీలను 6.5 శాతం తగ్గించాలని, రొయ్యలు, చేపల మేతతో కూడిన సీఫుడ్‌పై 5 శాతం తగ్గింపును  ఆర్థికమంత్రి ప్రతిపాదించారు. 

Union Budget 2024: కేంద్ర బడ్జెట్‌లో ఏ రంగానికి ఎన్ని రూ.కోట్లు కేటాయించారో తెలుసా?

ధరలు పెరిగేవి వీటికే..
➣ ప్లాటినం వస్తువులు
➣ బంగారు కడ్డీలు
➣ కృత్రిమ ఆభరణాలు
➣ సిగరెట్
➣ వంటగది చిమ్నీలు
➣ కాంపౌండ్ రబ్బరు
➣ కాపర్ స్క్రాప్
➣ దిగుమతి చేసుకున్న టెలికాం పరికరాలు

ధరలు తగ్గేవి వీటికే..
➣ కొన్ని రకాల కేన్సర్ మందులు
➣ మెడికల్ ఎక్స్-రే యంత్రాలు
➣ మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు
➣ చేపలు,  రొయ్యల మేత
➣ తోలు వస్తువులు
➣ పాదరక్షలు
➣ వస్త్రాలు
➣ బంగారం, వెండి, ప్లాటినం తయారీ ఛార్జీలు

Economic Survey: కీలక ప్రకటన.. ఏడాదికి 78.5 లక్షల ఉద్యోగాలు!

Published date : 23 Jul 2024 06:09PM

Photo Stories