Skip to main content

Union Budget 2024-25 Live Updates : కేంద్ర బడ్జెట్ 2024-25 తాజా స‌మాచారం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : కేంద్ర బడ్జెట్ 2024-25 సమావేశాలకు ముహూర్తం ఖ‌రారైంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ 3.0 కేబినెట్‌లో తొలి బ‌డ్జెట్‌ను జూలై 23వ‌ ప్ర‌వేశ‌పెట్ట‌నుంది.
Prime Minister Narendra Modis 3.0 Cabinet  Interim Budget 2024 introduction in Parliament  Budget presentation by Finance Minister in Lok Sabha Union Budget 2024-25 Updates  Lok Sabha session on Union Budget 2024 25

2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆర్ధిక‌శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు.. ఫిబ్రవరి 1వ తేదీన‌ పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విష‌యం తెలిసిందే. 

☛ Union Budget Highlights 2024-25 : కేంద్ర ఆర్థికమంత్రులుగా ఉండి.. బడ్జెట్‌ ప్రవేశపెట్టని వారు వీరే.. కార‌ణం తెలిస్తే.. మీరే..

ఈ సారి కొత్త సంప్రదాయానికి నిర్మ‌లా శ్రీకారం..
సంప్రదాయం ప్రకారం లోక్‌స‌భ‌ ఎన్నికలు జరిగే సంవత్సరం ముందుగా మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెడ్తారు. అందులో కీలకమైన పాలసీ ప్రతిపాదనలు, ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు ఉండవు. లోక్ సభ ఎన్నికలు ముగిసిన తరువాత, గెలిచిన ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడ్తుంది. అందులో కీలక ప్రతిపాదనలు, నిర్ణయాలు ఉంటాయి.
ఎప్పటిలా సూట్‌కేసులో కాకుండా రాజముద్ర ఉన్న ఎరుపు రంగు వస్త్రంలో బడ్జెట్‌ ప్రతులను తీసుకొచ్చే కొత్త సంప్రదాయానికి నిర్మ‌లా శ్రీకారం చుట్టారు.

 Union Budget 2024 Highlights: 2024 బడ్జెట్‌లో కీలకమైన అంశాలు ఇవే..!

రాష్ట్రపతి ఆమోదం..
జూలై 22వ తేదీ నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు శనివారం ప్రకటించారు. ఈ స‌మావేశాలు ఆగస్టు 12వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయ‌ని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను జులై 23న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు ఆయ‌న‌ వెల్లడించారు. అలాగే బడ్జెట్ సమావేశాల తేదీలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని వెల్లడించారు. జూలై 22 నుంచి ఆగస్ట్ 12 వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయన్నారు. 2024-25 కేంద్ర బడ్జెట్ ను ఈ నెల 23న ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.

Published date : 08 Jul 2024 09:18AM

Photo Stories