Rohini 560 Rocket: రోహిణి-560 రాకెట్ పరీక్ష విజయవంతం
Sakshi Education
ఇస్రో శాస్త్రవేత్తలు జూలై 22వ తేదీ శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి రోహిణి-560 సౌండింగ్ రాకెట్‌ను ప్రయోగించారు.
దేశీయంగా తాము అభివ`ద్ధి చేసిన ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ టెక్నాలజీని ప్రయోగించడమో ప్రయోగం లక్ష్యమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రెండు దశల ఉప కక్ష్య సౌండింగ్ రాకెట్‌కు రెండు వైపులా ప్రొపల్షన్ వ్యవస్థలు సాలిడ్ మోటార్లు ఉంటాయి.
ఇప్పటి వరకు తాము ప్రయోగించిన అతి భారీ సౌండింగ్ రాకెట్ ఇదేనని అన్నారు. ప్రయోగం సందర్భంగా రాకెట్ పనితీరును పరిశీలించేందుకు పరిగణలోకి తీసుకున్న 110 పరామితులను సాధించామన్నారు.
Shenzhou-18 Mission: అంతరిక్ష నడకల్లో రికార్డు సృష్టించిన చైనా
Published date : 23 Jul 2024 06:35PM