Shenzhou-18 Mission: అంతరిక్ష నడకల్లో రికార్డు సృష్టించిన చైనా
భూదిగువ కక్ష్యలోని చైనా అంతరిక్ష కేంద్రం(సీఎస్‌ఎస్) ‘తియాన్‌గాంగ్’లో షెన్‌జౌ–18 మిషన్‌లో భాగంగా ముగ్గురు వ్యోమగాములు నిర్వహించిన స్పేస్‌వాక్ చరిత్రలోనే 16వదిగా నమోదైంది. ఈ అద్భుత ఘనతతో చైనా కొత్త రికార్డును సృష్టించింది.
➣ యె గాంగ్‌ఫు, లీ కాంగ్, లీ గాంగ్‌సూ అనే ముగ్గురు వ్యోమగాములు దాదాపు 6.5 గంటల పాటు అంతరిక్షంలోకి వెళ్లి, శూన్య వాతావరణంలో విహరించారు.
➣ ఈ స్పేస్‌వాక్ సీఎస్‌ఎస్ అప్లికేషన్, డెవలప్‌మెంట్ దశలో భాగం.
➣ లీ కాంగ్ తెల్లటి స్పేస్ సూట్ ధరించి చేసిన ఈ స్పేస్‌వాక్ చిత్రాలు, వీడియోలు విడుదల చేశారు.
➣ షెన్‌జౌ-18 మిషన్‌లో ఇది రెండో స్పేస్‌వాక్.
➣ మే 28వ తేదీ ఈ మిషన్‌లోనే 8.5 గంటలపాటు మరొక స్పేస్‌వాక్ జరిగింది.
Chang'e-6 Lunar Mission: చంద్రుడి అవతలి వైపు నుంచి మట్టి నమూనాలను సేకరించిన దేశం ఏదో తెలుసా..
చైనా అంతరిక్ష నడకల చరిత్ర ఇదే..
➣ 2021 జూలైలో షెన్‌జౌ-12 మిషన్‌లో జరిగిన మొదటి స్పేస్‌వాక్‌తో చైనా ఈ ఘనతను ప్రారంభించింది.
➣ షెన్‌జౌ-13 మిషన్‌లో మొదటి మహిళా వ్యోమగామి స్పేస్‌వాక్‌లో పాల్గొన్నారు.
➣ షెన్‌జౌ-14 మిషన్‌లో ముగ్గురు వ్యోమగాములు మూడు స్పేస్‌వాక్‌లు నిర్వహించారు.
➣ షెన్‌జౌ-15 మిషన్‌లో ఒకే వ్యోమగామి ఆరు నెలల వ్యవధిలో నాలుగు స్పేస్‌వాక్‌లు చేసి ఘనత సాధించాడు.