Steel Authority of India: సెయిల్ ఈ ఏడాది పెట్టుబడి రూ.6,500 కోట్లు
Sakshi Education
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6,500 కోట్ల మూలధన వ్యయం చేయనుంది.
దీనికి సంబంధించిన విషయాలను సెయిల్ సీఎండీ అమరేందు ప్రశాశ్ వెల్లడించారు.
2030 నాటికి రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పెట్టుబడితో సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 20 మిలియన్ టన్నుల నుంచి 2031 నాటికి 35 మిలియన్ టన్నులకు, తర్వాత 50 మిలియన్ టన్నులకు పెంచుతారు. భారతదేశ స్టీల్ పరిశ్రమ వచ్చే పదేళ్లలో ఏటా సగటున 8% వృద్ధి చెందుతుందని సెయిల్ అంచనా వేసింది.
Published date : 08 Jul 2024 09:50AM